ప్రపంచ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం:టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు,సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఈ సందర్బంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్లీనరీకి ఆహ్వానితులు మాత్రమే హాజరుకావాలని కోరారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శ్రేణులు వారి వారి దేశాలలో కోవిద్ నిబంధనలు అనుసరించి ఘనంగా జెండా పండగ నిర్వహించాలని పిలుపు నిచ్చారు.ఈసారి పరిమిత ఆహ్వానితులు దృశ్యా 15 – 20 దేశాల ప్రతినిధులు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో పాల్గొంటున్నారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here