హైదరాబాద్:దేశంలో విజయవంతమైన ఎన్నికల వ్యూహకర్తగా పేరుపొందిన ప్రశాంత్ కిషోర్ ను ప్రస్తుతం తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంగేజ్ చేసుకుంది.కొద్ది రోజుల కిందట నేరుగా తెలంగాణ లో పర్యటించి,గులాబీ బాస్,సీఎం కేసీఆర్ ను కలిసి,కీలక రిపోర్టులు అందజేశారాయన.ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో పీకే భేటీ అవ్వడంతో పాటు గులాబీ బాస్ సొంత నియోజకవర్గం గజ్వే ల్‌లో పర్యటించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.ఆయన టీమ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరు,ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి,సంక్షే మ పథకాలు,ఎమ్మెల్యేలు,మంత్రుల పనితీరుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రాథమిక నివేదిక ఇచ్చారు.రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారంటూ సీఎం కేసీఆరే ఇటీవల స్వ యంగా ప్రకటించారు.అయితే తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యహహారం టీఆర్ఎస్లో గందరగోళం సృష్టించింది.ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు సంకేతాలు వచ్చాయి.పీకే కాంగ్రెస్‌లో చేరి జాతీయ రాజకీ యాల్లో చక్రం తిప్పుతారని ప్రచారం జరుగుతోంది.ఈ సమయంలో ఆయన సేవలు వాడుకునే విషయంలో గులాబీ బాస్ సందిగ్ధంలో పడ్డట్టు తెలుస్తోంది.అయితే పీకే శిష్యుడు సునీల్ సేవలు కేసీఆర్ వాడుకుంటారని వార్తలు సైతం వస్తున్నాయి.కానీ,సునీల్ సైతం కాంగ్రెస్ కోటరీలో సెటిలవ్వడంతో ఇది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు.దక్షిణాదిన సునీల్ ఉత్తరాదిలో పీకే రాజకీయ సమీకరణాల్లో భాగంగా వేరే పార్టీకి పనిచేయాల్సి వస్తే తన టీం సభ్యులు టీఆర్ఎస్ పార్టీకే పనిచేస్తారని అప్పట్లోనే కేసీఆర్‌కు పీకే హామీ ఇచ్చినట్లు సమాచారం.అయితే ఇపుడు పీకే కాంగ్రెస్‌లో చేరితే ఆయన ఐప్యాక్ సేవలు టీఆర్ఎస్ వినియోగించుకుంటే ప్రజల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ ఒక్కటేననే భావన వెళుతుందని టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి.ఇదే జరిగితే ఇక బీజేపీ ఆరోపణలకు ఊతం ఇచ్చినట్లు కూడా అవుతుంది.దీంతో పీకే ఒకవేళ కాంగ్రెస్‌లో చేరితే వెంటనే ఆయన సేవలు తీసుకోవట్లేదని చెప్పేయాలని టీఆర్ఎస్ భావిస్తోందట.ఇప్పటికిప్పుడు ఎన్నికల వ్యూహకర్తను ని యమించుకోవడం కంటే రాజకీయ ఉద్ధండుడిగా పేరు గాంచిన కేసీఆర్ సేవలు చాలని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయట.దీంతో ఇప్పట్లో మరో ఎన్నికల వ్యూహకర్త ఆలోచనలు టీఆర్ఎస్ చేసే అవ కాశం లేదని సమాచారం.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...