కొమురంభీం ఆసిఫాబాద్:జిల్లాలోని రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేప ట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు.సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి అంకిత్,జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి,రాజేశం,అదనపు ఎస్.పి(అడ్మిన్) అచ్చేశ్వరరావు,జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి,ఆసిఫాబాద్,సిర్పూర్ నియోజకవర్గాల శాసనసభ్యులు ఆత్రం సక్కు,కోనేరు కోనప్పలతో కలిసి జిల్లాలోని చిన్న వాంకిడి గ్రామ సమీపంలో గండి పడిన కాలువను పరిశీలించిన అనంతరం వట్టివాగు,అడ ప్రాజెక్టుల క్రింద ఉన్న కాలువలను తనిఖీ చేశారు.ముఖ్యమంత్రి కార్యదర్శి మాట్లాడుతూ సాగు నీటి కోసం రైతులు ఇబ్బంది పడకుండా ప్రాజెక్టు కింద కాలువల పనులు ఎలాంటి జాప్యం లేకుండా నిర్వహించాలని తెలిపారు.అడ ప్రాజెక్టు 10 టి.ఎమ్.సి.లు,వట్టివాగు ప్రాజెక్టు 2.89 ఎఫ్.టి.సి.నీటి సామర్థ్యం కలిగి ఉన్నాయని,ఈ ప్రాజెక్టుల కింద ఖరీఫ్ సీజన్ కు గాను సాగునీరు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యా లయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరై మాట్లాడారు.ప్రాజెక్టులకు అనుసంధానమైన కాలువలలో ఎలాంటి పూడిక లేకుండా తొలగింపు పనులు చేపట్టి చివరి ఆయక ట్టు వరకు సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలోని చెరువులు,కుంటల క్రింద తూముల ద్వారా సాగునీరు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు కార్యాచరణ రూపొందించి సకాలంలో నీటిని అందించాలని సూచించారు.కాలువలు,తూములలో అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.పనుల నిర్వహణలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని,గుత్తేదారులతో మాట్లాడి డిసెంబర్ నెలాఖరు వరకు పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.జిల్లాలోని అభివృద్ధి పనులకు అనుగుణంగా భూ సేకరణ కార్యక్రమాన్ని 95 శాతం పూర్తి చేయడం సంతోషంగా ఉందని,100 శాతం పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.మిషన్ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ శుద్ధజలం అందించే విధంగా సంబంధిత అధికారులు పనులు వేగవంతం చేయాలని,వంతెన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈ.ఎమ్.సి.చీఫ్ ఇంజ నీర్ వెంకటేశ్వర్,రాజస్వ మండల అధికారి దత్తు,జెడ్.పి.టి.సి.ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెలనాగేశ్వరరావు,ఎమ్.పి.పి.మల్లికార్జున్,సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Home ముఖ్యాంశాలు ఇంకెన్నాళ్లు..ప్రాజెక్టుల పనుల్లో జాప్యం పై సీరియస్:సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...
ఇంకెన్నాళ్లు పడుతుందో ప్రాజెక్టు పనులు పూర్తి కావడానికి.. ఈ గవర్నమెంట్ లో జరుగుతుందో లేకపోతే వచ్చే గవర్నమెంట్ లో జరుగుతుందో.. వేచి చూడాలి మరి…