హైదరాబాద్:అక్కినేని వారింటి కోడలుగా అడుగు పెట్టిన దగ్గర నుంచీ అమల వ్యక్తిగానూ తాను ఎంత శక్తిమంతమో నిరూపించుకున్నారు.భర్త నాగార్జున ఓ వైపు హీ రోగా,మరో వైపు నిర్మాతగా,ఇంకో వైపు స్టూడియో అధినేతగా,ఇవి కాక ఎంటర్ టైన్ మెంట్ మీడియా భాగస్వామిగా,హోస్ట్ గా,ఆంట్రప్రెన్యూర్ గా సాగుతూ ఉండగా,అ ర్ధాంగిగా ఆయనకు అన్ని విధాలా నైతికబలాన్ని అందిస్తున్నారు అమల.నవతరం కథానాయకుడుగా తనయుడు అఖిల్ ను తీర్చిదిద్దే ప్రయత్నంలోనూ ఉన్నారామె. జంతు సంరక్షణ కోసం ‘బ్లూ క్రాస్ సంస్థ’ను ఏర్పాటు చేసి,తద్వారా జంతువులను తాను ఎంతగా ప్రేమిస్తున్నానో నిరూపించారు అమల.ఇలా ప్రస్తుతం సాగుతున్న అ మల ఒకప్పుడు అందాలతారగా జేజేలు అందుకున్నారు.ముఖ్యంగా నాగార్జున హిట్ పెయిర్ గా ఆమె అలరించారు.ఆ వైనాన్నీ అభిమానులు ఈ నాటికీ గుర్తు చేసుకొ ని మురిసిపోతున్నారు.బెంగాల్ లో జన్మించిన అమల చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి భరతనాట్యంలో బి.ఎఫ్.ఏ.చేశారు.ప్రపంచవ్యాప్తంగా పలు నాట్య ప్రదర్శనలు ఇ చ్చారు.ఆమె నాట్యం చూసిన ప్రముఖ నటుడు,దర్శకుడు టి.రాజేందర్, అమలను నటింప చేయాలని ఆశించారు.అమల తల్లిని అంగీకరింపచేసి,తన ‘మైథిలీ ఎన్నై కాదలి’ చిత్రం ద్వారా తెరకు పరిచయం చేశారు.ఆ సినిమా ఘనవిజయంతో అమలకు ఎంతో పేరు లభించింది.సినిమాల్లో నటించే అవకాశాలూ వెల్లువెత్తాయి.తెలుగు లో నాగార్జున నటించిన ‘కిరాయిదాదా’ చిత్రంతో జనం మదిని దోచేశారు అమల.ఆ తరువాత “రక్తతిలకం,రాజా విక్రమార్క,అగ్గిరాముడు,ఆగ్రహం”వంటి చిత్రాలలో న టించారు.నాగార్జునతో కలసి అమల “చినబాబు,శివ,నిర్ణయం,ప్రేమయుద్ధం”వంటి చిత్రాలలో అలరించారు.నాగార్జున కెరీర్ ను పెద్ద మలుపు తిప్పిన ‘శివ’తెలుగు, హిందీ రెండు వర్షన్స్ లోనూ అమల నటించి మెప్పించారు.తెలుగు,తమిళ,హిందీ,కన్నడ,మళయాళ భాషల్లో అమల నటించిన అనేక చిత్రాలు జయకేతనం ఎగుర వే శాయి.ఆమె నటించిన తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై అలరించాయి.తెరపై నాగార్జునకు విజయనాయికగా నిలచిన అమల,తరువాత జీవితనాయిక అ య్యారు.‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’ అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు అమల,నాగార్జున.వారి కుమారుడు అఖిల్ బాల్యంలోనే ‘సిసింద్రీ’గా నటించి ఆకట్టు కున్నాడు.‘సిసింద్రీ’ షూటింగ్ సమయంలో అమల తన తనయుడు అఖిల్ ను నటింప చేయడంలో ఎంత శ్రద్ధ వహించారో అందరికీ తెలుసు.ఇప్పటికీ తన దరి చేరిన పాత్రల్లో నటించడానికి సిద్ధం అంటారు అమల.ఆ మధ్య ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నటించారు.తరువాత అక్కినేని ఫ్యామిలీ హీరోస్ అందరూ అభినయించిన ‘మనం’ లోనూ ఆమె కాసేపు కనిపించారు.బుల్లితెరపైనా అమల కొన్ని సీరియల్స్ లో నటించారు.ప్రస్తుతం శర్వానంద్ హీరోగా నటిస్తోన్న తెలుగు,తమిళ చిత్రంలోనూ అమల ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.అమల మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
Latest article
World Cup 2023: ఇదే మీకు, మాకు తేడా.. ప్రపంచ కప్‌పై కాళ్లు పెట్టి, బీరు తాగిన ఆసీస్...
ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు సంబరాలు అంబరాన్నంటాయి. ఆటగాళ్లందరూ ఒకరినొకరు హత్తుకుంటూ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరుపై...
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...