దొరతనాన్ని ఎదిరించిన వీ రనారి..చాకలి అయిలమ్మ

వరంగల్:దొరతనాన్ని,పెత్తందారి వ్యవస్థను ఎదిరించిన ధీర వనిత- చాకలి ఐలమ్మ యొక్క 35వ వర్దంతి సందర్భంగా ఘన నివాళులు.జననం 26-09-1895.మ రణం 10-09-1985 “చిట్యాల ఐలమ్మ” ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.కాని చాకలి ఐలమ్మ అంటే తెలియనివారు ఉండరు.ఆధిపత్యవాదంపై ఎక్కు పెట్టిన ఆయు ధం ఆమె.అన్యాయాన్ని నిలదీసిన సివంగి.వివక్షపై వీరోచితంగా పోరాడిన యోధురాలు.దొరతనాన్ని ఎదిరించిన ధీరత్వం ఆమె సొంతం.భూస్వాముల పై గర్జించిన వీరవనిత.ఆకలికి అతి చేరువైన చాకలి కులంలో జన్మించింది ఐలమ్మ.1895లో వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో ఆమె కళ్లు తెరిచింది. మల్లమ్మ,సాయిలు దంపతుల ముద్దుబిడ్డ.చిన్న,చితక కులాలు,చేతి వృత్తిదారులు అరిగోస పడుతున్న కాలమది.భూస్వాములు,పటేల్‌,పట్వారీల పదఘట్టనల కిం ద బలహీనులు నలిగి అణగారుతున్న రోజులవి.మట్టిలో పుట్టి వెట్టిలో మగ్గిన జాతి నుంచి వెలుగురేఖలాగా దూసుకొచ్చింది.చీకటి బతుకుల్లో వెలుగులు నింపిన ఆశా దీపం.ఆనాటి సామాజిక పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉండేవి.దొరలు,భూస్వాములు,పటేల్‌,పట్వారీలు కనపడితేనే భయం భయంగా,బిక్కుబిక్కుమంటూ దయ నీయంగా బతకాల్సిన పరిస్థితి అణగారిన వర్గాలది.శ్రామిక మహిళల మాన,ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు.చిన్న వయస్సులోనే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్య తో పెళ్లి అయింది.ఆమెకు ఐ దుగురు కొడుకులు,ఇద్దరు కూతుళ్లు.పెద్ద కుటుంబం కావడంతో పూ టగడవడం కష్టంగా ఉండేది.వృత్తి పని చేసినా సరైన భుక్తి కలిగేది కాదు.ఆ పరిస్థితుల్లో పాలకుర్తి పరిసరాల్లో మల్లంపల్లి దొర వద్ద రెండు ఎకరాల భూమిని ఐలమ్మ కుటుంబం కౌలుకు తీసుకొని సాగు చేసేది.ఇది పాలకుర్తి పొరుగునే ఉన్న విస్నూరు గ్రామానికి చెందిన దొర రామచంద్రారెడ్డికి కోపం తెప్పించింది.ఐలమ్మ కుటుంబం సొంతంగా భూమిని కౌలుకు తీసుకొని సాగు చేసుకోవడం సహించ లేక పోయాడు.నల్లగొండ,వరంగల్‌,ఖమ్మం జిల్లాల్లోని పెద్ద దేశ్‌ముఖ్‌లలో విస్నూరు రామచంద్రారెడ్డి ఒకరు.జనగామ తాలూకాలోని 40 గ్రామా ల్లో 40వేల ఎకరాల భూమి ఉన్న దేశ్‌ముఖ్‌ ఆయన.విస్నూరు దొర కు నరరూప రాక్షసుడనే పేరు ఉండేది.బువ్వకు లేనోళ్లు భూమి గు రించి ఆరాటపడటమంటే తలెత్తుకుని సగర్వంగా నిలబడటం కిందే లెక్క.అది దొర ఆధిపత్యానికి సవాల్‌ అన్నమాటే.ఐలమ్ము భర్తను,కొ డుకును జైలుపాలు చేశాడు.ఐలమ్మ పొలాల్లోని పంటలను గూండాలతో కొల్ల గొట్టించాలని చూశాడు.ఐలమ్మ ధీరోద్ధాతగా నిలబడి ఎదిరించింది.కొంగు నడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగివలే గర్జించింది.కమ్యూనిస్టు కార్యకర్తల సహాయం తో గూండాలను తరిమికొ ట్టింది.ఒడుపుగా పంటను ఇంటికి చేర్చింది.ఐలమ్మపై దొర అంతకం తకు కక్ష పెంచుకుని గూండాలతో దాడులు చేయించేవాడు.ఆమె మా త్రం ఆత్మ విశ్వాసాన్నే ఆయుధంగా చేసుకొని ఎదిరించేది. ‘‘నీ గడీల గడ్డి మొల్తది’’ అని తూటాల్లాంటి మాటలతో దొరను గడగడలాడిం చింది.అప్పట్లో ఆమెతోపాటు కమ్యూనిస్టు నాయకులపై పాలకుర్తి దొమ్మి కేసు పెట్టించాడు దొర.ఖూనీకోర్లతో దాడి చేయించాడు.కోర్టు కు విన్నవించుకుందామని వెళ్తుంటే భువనగిరి సమీపంలో వా రిపై దాడి చేయించాడు.తీవ్రగాయాలతోనే హైదరాబాద్‌ వచ్చారు.ఈ సంఘటనను ‘మీజాన్‌’ ఉర్దూ,తెలుగు దినపత్రికలో సంపాదకులు అడివి బాపిరాజు ప్రముఖంగా ప్ర చురించారు.విస్నూరు దొర ఆగడాలకు ఆమె కుటుంబం ఛిద్రమైంది.పోరాటంలోనే కొడుకు,భర్త ప్రాణాలు వదిలారు.అయినా వెరవలేదు.అగ్నికణం వలె నిత్యం ఉద్య మ నెగళ్లను కాపాడేది.భూపోరాటాలకు దారి చూపి నైజాం రాజ్యం పత నానికి పునాదులు వేసినా ఆమెకు దక్కిందేమీలేదు.కనీసం స్వాతంత్య్ర సమరయోధుల ఫించ న్‌కు కూడా నోచుకోకపోవడం గమనార్హం.

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో మలి విడత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగి విజయం సాధించింది.తెలంగాణ తొలి ప్రభుత్వమైనా ఆమెకు సముచిత గుర్తింపునివ్వా లి.ఆమె జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలి.హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ప్రతి ష్టించాలి.వరంగల్‌తో పాటు ప్రతి జిల్లాలో ఆమె విగ్రహాలు నెలకొ ల్పాలి.స్మారక భవనాలు నిర్మించాలి.ఆమె పేరిట ఒక యూనివర్సిటీని ఏర్పర్చాలి.ప్రతి ఏటా ప్రభుత్వమే ఆమె జయంతి,వర్ధంతి కార్యక్ర మాలను ఘనంగా నిర్వహిం చాలి.ఆమె పేరిట ఒక కొత్తజిల్లాను ఏ ర్పాటు చేయాలి.ఆర్థికంగా కుంగిపోయిన ఆమె కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలి.ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న కన్ను మూసింది.అయితే తెలంగాణ మలి దశ ఉద్యమంలో యావత్‌ తెలంగాణ జాతికి పోరాట స్ఫూర్తి నింపిన వీరనారిని నేడు విస్మరించడం అత్యంత బాధాకరం.ఇక్కడ దళి త,బహుజనవర్గాల ఆందోళన పరుస్తున్న విషయం మరొకటి ఉన్నది.అదేమిటంటే,కేవలం చాకలి ఐలమ్మ మాత్ర మే విస్మృతికి గురవుతున్నది.ఇందుకు కారణాల ను లోతుగా అధ్యయనం చేస్తే,అణువణువూ సామాజిక వివక్షే ప్రస్ఫుటమవుతోంది. అదే మలి విడత ఉద్యమంలో పోరాట స్ఫూర్తి నింపిన ఇతర యోధు లకు నేడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పట్టం కడుతుందో చూస్తూనే ఉన్నాం.చాకలి కులానికి చెందిన మహిళ అవడమే ఐలమ్మ చేసుకున్న పాపం అన్న విషయం ఇక్కడ స్పష్టమౌతున్నది.ఐలమ్మ త్యాగాలను విస్మరించింది.చాకలి ఐలమ్మ అమర్ రహే..!జై పూలే..! జై అంబేడ్కర్..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here