హుజూరాబాద్ లో కూలీ పనికి బదులు ప్రచారానికి..

కరీంనగర్:కొద్ది రోజుల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది.గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.ప్రధానపార్టీలకు చెందిన నేతలు తమ ప్రచారానికి పోటీ పడి గ్రామాల నుంచి మహిళా కూలీలను తీసుకెళ్తున్నారు.దీంతో ఇప్పుడు హుజూరాబాద్ లో వ్యవసాయ పనులకు కొరత నెలకొంది.ఈ క్రమంలోనే ఓ గ్రామానికి చెందిన మహిళలు ఇప్పుడు పార్టీల వెంట పడుతున్నారు.ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక కొందరికీ లాభంగా మారింది.కూలీ పనికి వెళ్లే వాళ్లు ఇప్పుడు పార్టీల తరుఫున ప్రచారానికి వెళుతున్నారు.పొద్దున్నుంచి సాయం త్రం వరకు ఎండలో కూలీ చేస్తే రూ.300 ఇస్తున్నారని ప్రచారానికి వెళ్తే అంతకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు.పొద్దున ఓ పార్టీకి సాయంత్రం మరో పార్టీకి ఓట్లు అ డుగుతున్నామని అంటున్నారు.ఇప్పుడు కూలీలకు ఇది గిట్టుబాటు అయ్యేలా కనిపిస్తోంది.ఇప్పుడు ప్రచారానికి రూ.1000 వరకూ ఒక్కొక్కరికి ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.ఎన్నిక ల వల్ల కూలీలు పండుగ చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here