తొమ్మిదోసారి..గులాబీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ ఏకగ్రీవం

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షునిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఎన్నికయ్యారు.సోమవారం హైదరాబాద్‌ హైటెక్స్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో కెసిఆర్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన శ్రీనివాసరెడ్డి ప్రకటించగా,సభ ఆమోదం తెలిపింది.అనంతరం కెసిఆర్‌ మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకు లు ఢిల్లీకి గులాములు కారని,తమకు ప్రజలే బాసులని అన్నారు.తెలంగాణ ప్రజల అవసరాల ఇతివృత్తంగా ముందుకు నడిచే ఏకైక పార్టీ టిఆర్‌ఎస్‌ అని పేర్కొన్నారు.అన్ని రంగాల్లో తె లంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని,తెలంగాణలో పండించిన ధాన్యాన్ని అంతటినీ కొనలేమని ఎఫ్‌సిఐ చెబుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అన్నారు.11.5 శాతం వృద్ధి రేటుతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని తెలిపారు.దళితబంధు పథకం కాదని అదో ఉద్యమమని పేర్కొన్నారు.ఈ పథకానికి ఏడేళ్లలో రూ.23 లక్షల కోట్లు ఖర్చు పెడతామన్నారు.2 028 నాటికి రాష్ట్ర బడ్జెట్‌ రూ.4.28 లక్షల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు.దళితబంధు దేశాన్ని తట్టిలేపుతుందని,అణగదొక్కబడిన వర్గాలు ఆర్థిక స్వావలంబన సాధిస్తాయని వి శ్వాసం వ్యక్తం చేశారు.ఇతర సామాజిక తరగతుల్లోని పేదలకు మేలు జరిగేలా ఏడాదిలోగా దళితబంధు తరహా పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు.రాష్ట్రం విడిపోతే తెలంగాణ అం ధకారమే అన్న ఆంధ్ర నేతల రాష్ట్రంలోనే ప్రస్తుతం కరెంటు లేదని,తెలంగాణలో 24 గంటలూ విద్యుత్‌ వెలుగులు ఉన్నాయని కెసిఆర్‌ అన్నారు.దళితబంధు ప్రకటించాక ఆంధ్రప్రదేశ్‌ నుం చి వేల విజ్ఞాపనలు వస్తున్నాయని,ఆంధ్రాలో పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని అక్కడ ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు.ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వ చ్చి పని చేస్తున్నారని గుర్తు చేశారు.తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయని అన్నారు.ఆర్థిక వనరుల పరంగా కూడా టిఆర్‌ఎస్‌ బ లంగా ఉందన్నారు.పార్టీకి రూ.425 కోట్ల ఎఫ్‌డిలు ఉన్నాయని తెలిపారు.పది నెలల్లో ఢిల్లీలో టిఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here