కరీంనగర్:ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో నేటి మానవుడి నడవడికను నిర్దేశిస్తూ అనేక విషయాలను విశదీకరించారు.సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని పాలకు లు ప్రజలకు చేయాల్సిన మేలుని రాజ్య పాలన,ప్రజల సుఖ సంతోషాలు,మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు.నేటి మానవుడు జీవి తంలో సక్సెస్ అందుకోవాలన్నా ఆనందంగా జీవించాలన్నా ఐదు సూత్రాలను పాటించాలని చాణక్యుడు చెప్పాడు.మనిషి కి ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు.క నుక భవిష్యత్ లో ఎదురయ్యే సమస్యలను ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవడానికి తాను సంపాదించినా దానిలో కొంత మొత్తం తప్పనిసరిగా పొదుపు చేయమని చాణుక్యుడు సూచించా డు.అనవసరంగా ఆడంబరాలు కోసం డబ్బు ఖర్చు పెట్టేస్తుంటే మనదగ్గరున్న సంపద వేగంగా తరిగిపోతుందని తెలిపాడు.ఎవరైనా మీ దగ్గర అతి మధురంగా మాట్లాడే వ్యక్తల విషయం లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటివారి మనసులో విషపు ఆలోచనలు ఉంటాయని మిమ్మల్ని ఏదొక విషయంలో దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అర్ధం కనుక మూర్ఖుడితో టి అతిగా పొగిడేవారితో సహవాసం వద్దని ఆచార్య చాణక్య సూచించారు.ఇక మనిషి సక్సెస్ లో ప్రధాన పాత్ర వహించేది మీరు చేసేపని ఎవరికీ చెప్పకపోవడం మీరు చేయాలనుకున్న పనులు ప్రణాళిక బద్ధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయడం.ఎవరైనా సరే తమ ఆలోచన,జ్ఞానం సమయానికి అనుగుణంగా వినియోగించాల్సి ఉంటుంది.లేదంటే జ్ఞానాన్ని ఉప యోగించని వాడికి ఎప్పటికైనా ఓటమి తప్పదని చాణుక్యుడు చెప్పాడు.చాణుక్యుడు చెప్పిన ఈ నీటి సూత్రాలు మనిషి సక్సెస్ కోసం ఏది చేయాలి,ఏమి చేయకూడదు తెలుసుకోగలు గుతాడు,మంచి,చెడుల తేడాను తెలుసుకున్న వ్యక్తి ఉత్తమమైన జీవితాన్ని గడుపుతాడు.