హైదరాబాద్ లో తుపాకుల కలకలం..ముగ్గురి అరెస్ట్‌

హైదరాబాద్:తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారి నుంచి ఓ కంట్రీ మేడ్‌ పిస్టల్‌,తపంచా,రెండు మేగజిన్‌లు,మూడు బుల్లెట్లు,ఆరు మొబైల్‌ ఫోన్లు,ఓ ద్విచక్ర వాహనం,కారు స్వాధీనం చేసుకున్నారు.వారిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన లియోనాడ్‌ స్వామి (34) ఉ ప్పల్‌లో ఉంటున్నాడు.గచ్చిబౌలి,మియాపూర్‌,కూకట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ల పరిధిలో పలువురిని బెదిరించిన కేసుల్లో నిందితుడు.యాదగిరిగుట్టలో ఉంటున్న సాయి కృష్ణ (26)కు పిస్టల్‌ విక్రయించ డానికి స్నేహితుడు చింతకింది సాయిరాం (26)తో కలిసి లియోనాడ్‌ బేరం కుదుర్చుకున్నాడు.సమాచారం అందుకున్న మాదాపూర్‌ ఎస్‌వోటీ పోలీసుల దాడులు నిర్వహించి ముగ్గురినీ అదుపులో కి తీసుకున్నారు.తదుపరి విచారణ నిమిత్తం వారిని మియాపూర్‌ పోలీసులకు అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here