నన్ను అధికార పార్టీ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారంటూ..పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

హనుమాన్‌ జంక్షన్‌:ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నాని వారి మనుషులతో సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ప్రధానకార్యదర్శి మూ ల్పూరి కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.రాచేటి రూతమ్మ అనే మహిళతో తనను తీవ్ర పదజాలంతో తిట్టిస్తూ ఆడియో సంభాషణ పంపారని పేర్కొన్నారు.ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని హను మాన్‌జంక్షన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా గన్నవరంలో ఆయన విగ్రహం కనపడకుండా ఫ్లెక్సీలు కట్టి,సభావేదిక ఏర్పాటు చేశారని,దీనిని బహిరంగంగా నిలదీ యడంతో వంశీ,ఆయన అనుచరులు తనపై సామాజిక మాధ్యమాల ద్వారా దాడికి దిగారన్నారు.ఈ నెల 10న తనను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఆడియో సంభాషణ వాట్సప్‌ చేశారన్నారు.గన్నవరానికి చెందిన రూతమ్మ ఈ సంభాషణ చేసినట్లుగా తమ పరిశీలనలో తేలిందన్నారు.వైకాపా అరాచకాలు ప్రశ్నిస్తున్నందుకే తనపై ఇలా దిగజారుడు రాజకీయం చే స్తున్నారంటూ ఆమె వాపోయారు.ఫిర్యాదుపై విచారణ నిర్వహిస్తున్నామని ఎస్సై చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here