మమత నేతృత్వంలో జరిగిన సమావేశంలో సంచలన నిర్ణయం..

న్యూఢిల్లీ:రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ బుధవారం నిర్వహించిన సమావేశం ముగిసింది.దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ఈ ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో ఓ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు.కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత మమత బెనర్జీ మాట్లాడుతూ,రాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని అందరు నేతలు ఏకాభిప్రాయంతో అంగీకరించారని చెప్పారు.అయితే శరద్ పవార్ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆస క్తి కనబరచకపోతే,ఇతర పార్టీలకు చెందిన ఇతర నేతల పేర్లను పరిశీలిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో పాల్గొనని టీఆర్ఎస్,బీజేడీ వంటి పార్టీల గురించి మమత మాట్లాడుతూ,వారు ఈసమావే శంలో పాల్గొనకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నారు.ఈ సమావేశానికి చాలా పార్టీలు వచ్చాయని,హాజరుకాని పార్టీల నేతలకు ఇతర కార్యక్రమాలు ఉండి ఉంటాయని చెప్పారు.ఈ సమావేంలో 17 పార్టీల నేతలు పాల్గొన్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here