ఈ మందు..ఇట్టే బరువు తగ్గిస్తుందట.!

డెన్మార్క్:పాపం ఊబకాయులు ఎదుర్కొనే సమస్యలు మహా ఇబ్బందికరంగా ఉంటాయి.అవి ఎంతలా వారిని వేధిస్తాయో అనుభవించే వాళ్లకు మాత్రమే తెలుసు.కొం త మంది ఏ పనీ యాక్టివ్ గా చేయలేకపోతే మరికొందరు తమ శరీరాన్ని కూడా మోసుకెళ్లలేక అవస్థలు పడుతుంటారు.ఇక దేహంలో ఉండే ఇతరత్రా ఆరోగ్య సమస్య లు వీటికి అదనం.అందుకే ఏం చేసైనా బరువు తగ్గించుకోవాలని ఆరాటపడుతుంటారు చాలా మంది.కానీ ఒళ్లు ‘వంచలేక’ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు.అయితే ఇలాంటి సమస్యను ఎదుర్కొనే అమెరికా వాసులకు ఓ కొత్త ఔషధం అందుబాటులోకి వచ్చింది.దాని పేరు’వెగోవీ’.డెన్మార్క్ సంస్థ నోవో నోర్డిక్స్ తయారు చేసిన ఈ మందు విక్రయాలకు అమెరికా ఆమోదం తెలిపింది.ఈ మేరకు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ ఆర్గనైజేషన్ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.డయాబెటీస్ పే షెంట్ల కోసం ఈ సంస్థ సెమా గ్లుటైడ్ అనే మందును గతంలో తయారు చేసింది.ఈ మందు హైడోస్ వెర్షనే ఈ ‘వైగోవీ’.ఈ మందు శరీరంలోని కొవ్వును స్థిరంగా కరిగిం చేస్తుందట.ఈ మందును ఇన్సులిన్ మాదిరిగా శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు.క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఈ మందు వాడిన వారు ఏకంగా15 శాతం బరువు తగ్గినట్టు ఆ సంస్థ వెల్లడించింది.ఈ మందును వినియోగించిన వారిని దాదాపు 16 నెలలపాటు అబ్జర్వేషన్లో ఉంచినట్టు తెలిపింది.ఈ కాలంలో వారు స్థిరంగా బరువు తగ్గినట్టు తెలిపింది.యూఎస్ లో దాదాపు 10 కోట్ల మందిపైనే ఊబకాయలు ఉన్నట్టు అంచనా మరి ఈ మందు ద్వారా ఎంత మంది బరువు తగ్గుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here