బోడకాకర కాయలతో ఎన్నో ప్రయోజనాలు..

హుస్నాబాద్:వర్షాకాలంలో లభించే బోడకాకరకాయలో ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ కూరగాయ తినడం వల్ల కలి గే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.బోడకాకర కాయను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బోడకాకరకాయ అని అంటారు. దీంట్లో ప్రోటీన్,ఫైబర్,కార్బోహైడ్రేట్లు,విటమిన్ ఎ,విటమిన్ బి 1,బి 2,బి 3,బి 5,బి 6,బి 9,బి 12,విటమిన్ సి,విటమిన్ డి 2,3,విటమిన్ హెచ్,విటమిన్ కె,కాల్షి యం,మెగ్నీషియం,పొటాషియం,సోడియం వంటి అనేక పోషకాలు ఉంటాయి.బోడకాకర కాయ మనకు చాలా బలాన్ని ఇస్తుంది.ఇది అనేక రకాల వ్యాధులకు దివ్య ఔషధం.ఆయుర్వేదంలో బోడకాకర కాయకు చాలా ప్రాముఖ్యత ఉంది.తలనొప్పి,జుట్టు రాలడం,చెవి నొప్పి,దగ్గు,కడుపు ఇన్ఫెక్షన్,పైల్స్,కామెర్లు,డయాబెటిస్,హెర్పె స్,దురద,పక్షవాతం,జ్వరం,వాపు,అపస్మారక స్థితి,పాము కాటు,కంటి సమస్య,క్యాన్సర్,రక్తపోటు వంటి అనేక భయంకరమైన వ్యాధుల చికిత్సకు దీనిని ఉపయోగి స్తారు.బోడ కాకర కాయనే కాకుండా దాని వేర్లు,పువ్వులు,రసం,ఆకులు మొదలైనవి అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు.బోడకాకర కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది.కిలోకు రూ.80 నుంచి రూ.150 వరకు పలుకుతుంది.వాస్తవానికి దాని ధర సీజన్,దాని లభ్యతపై ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here