అతి నమ్మకమే కొంప ముంచిందా..?

*దరికి చేర్చని దళిత బంధు*
*నమ్మకం కలిగించని అభివృద్ధి,సంక్షేమం*
*తాయిలాలిచ్చినా కనికరించని ఓటర్లు*
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నహుజురాబాద్ ఉప ఎన్నికలో పరాజయం మూటగట్టుకుంది.విజయం సాధించేందుకు అన్నిరకాల విశ్వప్రయ త్నాలు చేసినా హుజురాబాద్ ఓటరు మాత్రం టిఆర్ఎస్ ను తిరస్కరించారు.తాము చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని పదే పదే వల్లె వేసిన ఆ పార్టీ నాయకుల కు ఈ ఎన్నిక ఒక గుణపాఠంగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.కర్ణుని చావుకు వంద కారణాలన్నట్లు.టిఆర్ ఎస్ అధిష్టానం,ముఖ్య నాయకుల అతి నమ్మకం,నిర్లక్ష్య వైఖరి వెరసీ గెలుపు పట్టాల నుంచి తప్పించింది.ఐదు నెలలుగా ఇక్కడే తిష్ట వేసుకున్న ఆ పార్టీ ముఖ్య నేతలు కాళ్లకు బలపాలు కట్టుకుని మరీ సాగించిన ప్రచారాన్ని ఇక్కడి ప్రజలు పట్టించుకోలే దు.ప్రధానంగా ఇక్కడ అత్యధిక శాతం ఓటర్లున్నదళితులను ఆకర్షించి గట్టె క్కవచ్చన్న ప్రణాళికతో ప్రారంభించిన దళిత బంధు పథకం కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని గట్టెక్కించలేక పో యింది.ఆ పథకాన్ని ప్రారంభించిన శాలపల్లి గ్రామంలోనూ టిఆర్ఎస్ కు మెజార్టీ ఓట్లు దూరం కావడం గమనార్హం.ఈటల రాజీనామా నుంచి మొదలు దాదాపు ఐదు నెలల పాటు వివి ధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పేరిట టిఆర్ ఎస్ ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నియోజకవర్గంలో వెచ్చించింది. ఇదే గాకుండా ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.ఇంత చేసినా ఇక్కడి ఓటర్లు మాత్రం అధికార టిఆర్ ఎస్ను తిరస్కరించడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు.అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలెన్ని ప్రవేశపెట్టినా ఈటల రాజేందర్ పట్ల సానుభూతి ప్రకటించిన ఓటర్లు తిరిగి ఆయనకే పట్టం కట్టి ఈ నియోజకవర్గంలో మొట్ట మొదటిసారిగా బిజెపికి పట్టం కట్టారు. ఏడున్నరేళ్లు గా తాము చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ప్రకటిస్తూ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వాటి ఫలాలు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏ మేర కు వర్తించాయోనన్న విషయాన్నివిస్మరించారు.ఆరు సార్లు గెలిచిన ఈటల రాజేందర్ ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని,తమను గెలిపిస్తే హుజురాబాద్ను అన్ని రకా లుగా ముందంజలో నిలుపుతామని ప్రకటిస్తూ వచ్చారు.ఈటల రాజేందర్ అభివృద్ధి చేయలేదని ప్రకటించిన టిఆర్ ఎస్ నాయకులు,ఆయన కూడా తమ ప్రభుత్వంలో సభ్యుడని,మంత్రి వర్గంలో కూడా పనిచేశారన్న విషయాన్ని మరిచినట్లున్నారు.ఒక మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి సొంత నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటే అది ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నా ర్ధకం చేస్తుందన్న కనీస అవగాహను మరిచి వ్యాఖ్యలకు పాల్పడడం పట్ల అప్పట్లోనే పలు విమర్శలు వచ్చాయి.స్థానికేతరులైన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఇతర ప్రజాప్రతినిధులు ప్రచారా నికి వచ్చిన సందర్భంలో హుజురాబాద్ అభివృద్ధి గురించి వ్యాఖ్యానించి న సమయంలోనూ పలు విమర్శలు వినిపించాయి.సొంత నియోజకవర్గంలో ఏమీ చేయని వారు ఇక్కడకు వ చ్చి అభివృద్ధి మంత్రాలు వల్లె వేయడమేమిటని పలువురు ప్రశ్నించారు.ఇదంతా ఒక ఎత్తయితే ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరుగుతున్నా టిఆర్ ఎస్ అధినేత,ముఖ్య మంత్రి కెసిఆ ర్,ఆయన తనయుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్లు ఈ వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం పట్ల పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు విస్మయం చెందారు.ఇదో చిన్న ఎన్నిక,దాన్ని లెక్క చేయడం లేదని స్వయానా కెటిఆర్ వ్యాఖ్యానించడం కూడా పలువురిని ఆలోచింపజేసింది.భారతీయ జనతా పార్టీ మాత్రం ఈ హుజురాబాద్ ఎన్నిక టిఆర్ ఎస్ ఏడేళ్ల పాలనకు రెఫరెండ మని,ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేక భావం ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతుందని ప్రకటిస్తూ వచ్చారు.మొత్తానికి హుజురాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో అధికార టిఆర్ఎస్ కు కను విప్పు కలుగుతుందా..? రానున్నరెండున్నరేళ్ల కాలంలో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు ఏ మేరకు చేపడతారన్నది వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here