నువ్వా నేనా..హుజురాబాద్(షా)ఎవరో తేలేది నేడే..

0
301

కరీంనగర్:హుజురాబాద్ షాఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.కరీంనగర్ లోని ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఓట్ల లెక్కింపుకు 14 టేబుల్స్ ఏర్పాటు చేయగా 22 రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు.ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు.ఓట్ల లెక్కింపు సందర్బంగా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టింది.ఎస్సారార్ పరిస రాల్లో 144 నిషేదాజ్ఞలు విధించడంతోపాటు మూడంచెల భద్రత ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు.ఇదిలా ఉండగా హుజురాబాద్ ఉప ఎన్నికలలో టీఆర్ఎస్,బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా అదే స్థాయిలో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.అయితే కొన్ని సర్వేల్లో బిజెపి మరికొన్ని సర్వేల్లో టీఆర్ఎస్ గెలుపు అం టూ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి.ఇదిలా ఉండగా ఇప్పుడు సైలెంట్ ఓట్లపై విస్తృత చర్చ జరుగుతోంది.సైలెంట్ ఓట్లు ఎవరి వశం కానున్నాయన్నది హట్ టాఫిక్ గా మారింది.ఇటు తెరాస నే తలు అటు భాజపా నేతలు సైలెంట్ ఓట్లపై ఎవరికీవారు తమకే లభిస్తాయని దీమా వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి మరికొన్ని గంటల్లో జరగనున్న కౌంటింగ్ లో ఎవరు హుజురాబాద్ షా గా నిలుస్తారో వేచిచూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here