హుజూరాబాద్ ఫలితంపై తీవ్ర ఉత్కంఠ..గెలుపు ధీమాతో ఈటల,గెల్లు

కరీంనగర్:తెలంగాణతోపాటు ఏపీలో,జాతీయ స్థాయిలో,యావత్ ప్రపంచంలోని తెలుగువారిలో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.రాష్ట్రం ఏర్పడిన ఏడేళ్లలో తొలిసారి సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్టకు ముడిపడిన ఎన్నికలు కావడం రెండు దశాబ్దాలకుపైగా ఆయనకు ఆత్మీయుడిగా ఉండి అనూహ్య పరిస్థితుల్లో గెంటివేతకు గురైన ఈటల రాజేందర్ భవితవ్యాన్ని నిర్ణయించేది కావడంతో హుజూరాబాద్ ఫలితంపై సర్వత్రా ఎనలేని ఆసక్తి ఏర్పడింది.రికార్డు స్థాయిలో (86.64 శాతం) పోలింగ్ తర్వాత గెల్లు శ్రీనివాస్ విజయంపై టీఆర్ఎస్ ధీమాగా ఉండగా కరీంనగర్ లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ వేదికగా ఈటల రాజేందర్ గెలుపు ద్వారా గులాబీ దళానికి RRR సినిమా చూపించబోతున్నామని బీజేపీ నేతలు ఢంకా బజాయిస్తున్నారు.తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి ఇప్పుడున్న ఇద్దరు ఎమ్మెల్యేలు రాజాసింగ్,రఘునందన్ రావులకు రాజేందర్ తోడైతే కేసీఆర్ సర్కారుకు RRR బొమ్మ కనిపిస్తుందని కమలనాథులు అంటున్నారు.ఫలితాలు ఇలా..హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసిన తర్వాత కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూంలో ఈవీఎంలను భద్రపర్చారు.ఆ కాలేజీలోనే ఏర్పాటుచేసిన రెండు కౌంటింగ్ హాళ్లలో హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు మొదలవు తుంది.ఒక్కో కౌంటిం గ్ హాలులో ఏడు చొప్పున మొత్తం 14 టేబుల్స్‌ ఏర్పాటుచేరు.ఆయా మండలాలవారీగా మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు.ఈవీఎంలే కాబట్టి ఒక్కో రౌండ్ లెక్కింపునకు కనీసం 30 నిమిషాలు పడుతుంది.కౌంటింగ్ కేంద్రంలో కొవిడ్ ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున లెక్కింపు ప్రక్రియ కొంత నిదానంగా సాగొచ్చు.కౌంటింగ్ ప్రక్రియ ఎలా నిర్వహించాలి,ఫలితాల ను ఎలా వెల్లడించాలనేదానిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా ఎన్నికల అధికారులకు కీలక సూచనలు చేశారు.పొరపాట్లు లేకుండా ..హుజురాబాద్ అ సెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సజావుగా,పకడ్బందీగా నిర్వహించాలని ఎస్సీఈ గోయల్ అన్నారు.కౌంటింగ్ ప్రక్రియ పై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.చిన్న పొరపాట్లకు కూడా తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంల ను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని ఆయన సూచిం చారు.కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకునీ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Huzurabad result : SRR వేదికగా RRR సినిమా? -ఫలితాలు ఎలా వస్తాయో తెలుసా?


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here