ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు,ఎమ్మెల్యేలు,పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు: కేటీఆర్


హైదరాబాద్:హుజురాబాద్ ఎన్నికల్లో పార్టీ కోసం నిరంతరం శ్రమించిన మంత్రులు హరీష్ రావు,కొప్పుల ఈశ్వర్,గంగుల కమలాకర్ మరి యు పార్టీ ఎమ్మెల్యేలు,నాయకులు,పార్టీ శ్రేణు లకు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు కృతజ్ఞతలు తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ నాయకులు,శ్రేణులు ఎన్నికల్లో నిర్విరామంగా పని చేశారని,పార్టీ కోసం పని చేసిన సో షల్ మీడియా వ్యారియర్లకు సైతం మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.టిఆర్ఎస్ పార్టీ గత 20 సంవత్సరాలలో అనేక ఎత్తుపల్లాలను చూసిందని,కేవలం ఈ ఒక్క ఎ న్నిక ఫలితం ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం లేదన్నారు.ఈ ఎన్నికల్లో స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చిన పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా మరింత నిబద్ధతతో పని చేసేందుకు నిర్ణయం తీసుకొని,భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు ముందుకు పయనించాలని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here