స్ట్రాబెర్రీలు తింటే లాభాలెన్నో..!

వరంగల్:కరోనా వచ్చి పోయిన తరువాత అందరికి ఆరోగ్య స్పృహ మరింత పెరిగింది.ఈ క్రమం లో ఏ ఫుడ్ ఏ మేలు చేస్తుందో తెలుసుకుని తినడం ఉత్తమం.సోడి యం సమపాళ్లలో ఉండి.కొలెస్టరాల్ తక్కువ గా ఉండాలని కోరుకుంటే స్ట్రాబెర్రీలను మించిన ప్రత్యామ్నాయం లేదు.స్ట్రాబెర్రీలలో పొటాషియం,మాంగనీస్,విటమిన్ బి 9,విటమిన్ సి,లు పుష్కలం గా లభిస్తాయి.ఏ కాలానికి తగ్గట్లు ఆ పండ్లు తినడం వలన ఆరోగ్యం మీ సొంతమవుతుంది.శీతాకాలం లో స్ట్రాబెర్రీలు తినడం శరీరానికి ఎంతగానో మేలు చేస్తుంది.వీటిలో విటమిన్లు,ఫైబర్లు,ఎక్కువ శాతం యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇవి అంటువ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయి.అలాగే,స్ట్రాబెర్రీలు రక్తం లో షుగర్ శాతాన్ని తగ్గిస్తాయి.దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.గుండె జబ్బులు,మధుమేహం వంటివాటి నుంచి కూడా మీకు రక్షణ లభి స్తుంది.ఫ్రూట్ సలాడ్ లో కూడా మీరు స్ట్రాబెర్రీలను జత చేసుకుని తినవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here