26న ఇంటర్,30లోగా’పది’ఫలితాలు:మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్:తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈ నెల 26న వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ మంత్రి సబితా ఇం ద్రారెడ్డిని ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి కోరినట్లు సమాచారం.ఇప్పటకే ఇంటర్ ఫలితాల ప్రకటనపై అధికారులు ట్రయల్‌ రన్‌ చేస్తున్నారు.ఈ నెల 25నే ఇంటర్‌ ఫలితాలు వెల్లడించాలని మొద ట అధికారులు భావించారు.అయితే,కొంతమంది విద్యార్థుల మార్కులను కంప్యూటర్‌ ద్వారా ఫీడ్ చేయడంలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది.దీంతో వాటిని సరిచేసేందుకు అధికారులు ప్రయత్నాలు జరిపారు.కాగా,ఇంటర్ పరీక్షల ఫలితాల వెల్లడి ఆలస్యమైనా ఫర్వాలేదని,తప్పులు మాత్రం దొర్లకూండని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారలుకు తెలిపినట్లు సమాచారం.గత ఏడాది కరోనా నేపథ్యం లో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 49 శాతం మాత్రమే రావడం కలకలం రేపిన విషయం తెలిసిందే.చివరకు కనీస మార్కులతో అందరినీ పాస్ చేశారు.ఈ నేపథ్యంలో ఫలితాలను పరిశీలించి సక్రమంగా ప్రక్రియ ముగిసిందని నిర్థారించుకుంటేనే ఈ నెల 26వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది.మరోవైపు,తెలంగాణ పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేస్తామని అధికారులు చెప్పారు.జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన అనంతరం టెక్నికల్‌గా అన్ని అంశాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here