హైదరాబాద్:భద్రాద్రి కొత్తగూడెం టీఆర్ఎస్ నేత,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవం లేని చోట ఉండటం ఇష్టం లేకనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు.టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని,తన నియో జక వర్గంలో పోడు భూముల సమస్యను పరిష్కరించ లేదని చె ప్పారు.కేసీఆర్ కంటే ముందు కూడా తెలంగాణలో అభివృద్ది జరిగిందన్నారు.ఇక్కడ ఫ్లై ఓవర్‌లు వేయడం అభివృద్ది కాదని తన నియోజకవర్గం ప్రజల పోడు భూములకు పట్టాలు ఇస్తే సంతోషిస్తా మన్నారు.