తెలంగాణ..తొలి లైన్ ఉమన్‌గా శిరీష..

హైదరాబాద్:గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ,మగ అనే తేడా ఉండేది.అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది.కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో,అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం అనడంతో బస్ కండక్టర్ ఉద్యోగాల నుంచి ఇప్పుడు విద్యుత్‌శాఖ డిపార్ట్‌మెంట్‌లో లైవ్‌మెన్‌ ఉద్యోగాల వరకు దరఖాస్తులు చేస్తున్నారు యువతులు ఉద్యో గాలు సంపాధిస్తున్నారు.తెలంగాణకు చెందిన ఓ యువతి తొలి లైన్‌ విమెన్‌ ఉద్యోగం పొందింది.సిద్దిపేట జిల్లాకు చెందిన బీ.శిరీష మేడ్చల్‌లో సర్కిల్‌ లైన్‌ ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోంది.తెలంగాణ రాష్ట్ర దక్షిణా ప్రాంత విద్యుత్‌ సరఫరా సంస్థ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌)లైన్‌మెన్ల ఎంపికకు నిర్వహించిన దరఖాస్తులు,పోల్‌ క్లైంబింగ్టెస్టుల్లో శిరీష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాధించింది.ఈసందర్భంగా శిరీషకు తొలి లైన్‌ ఉమెన్‌గా ఉద్యోగ నియామకపత్రాన్ని సంబంధిత శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి చేతుల మీదుగా అందుకుంది.తొలి లైన్‌ ఉమెన్‌గా ఉద్యోగం పొం దిన శిరీషది స్వస్థలం సిద్దిపేట మేడ్చల్‌లో సర్కిల్‌ లైన్‌ ఉమన్‌గా విధులు నిర్వహిస్తోంది.మొదట ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నాటి నుంచి ఎలాగైనై ఉద్యోగం సంపాధించాలన్న పట్టుదలతోనే శి రీష ఉండటంతో ఉద్యోగానికి కావాల్సిన ఆమె అన్నీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది.ఉద్యోగ నియామకంలో ప్రధానమైన పరీక్ష విద్యుత్‌ స్తంభాలు ఎక్కడం.ఈ ఉద్యోగానికి యువతి అప్లై చేసుకోవ డంతో టీఎస్‌పీడీసీఎల్‌ గతేడాది డిసెంబర్‌ 20వ తేదిన శిరీషకు పోల్‌ క్లైంబింగ్ టెస్ట్‌కు హైకోర్టు నుంచి ఆర్డర్ అందుకున్నారు.రీసెంట్‌గా ఆ టెస్ట్ నిర్వహించారు.అందులో శిరీష సునాయాసంగా పోల్ క్లైంబింగ్‌ టెస్ట్‌ పాసవడంతో ఉద్యోగం వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here