అహ్మదాబాద్:ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-2తో కైవసం చేసుకుంది.శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో టీ20లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది.సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ సిరీస్‌ను ఘన విజయంతో ముగించింది.టాస్ ఓడి మొ దట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగులు చేసింది.రోహిత్ శర్మ(64:34 బంతుల్లో 4ఫోర్లు,5సిక్సర్లు)విరాట్ కోహ్లీ(80 నాటౌట్: 52 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు)అద్భుత అర్ధశతకాలతో విజృంభించగా సూర్య కుమార్ యాదవ్(32:17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు)హార్దిక్ పాండ్య(39 నాటౌట్: 17 బంతుల్లో 4ఫోర్లు,2సిక్సర్లు)ధనాధన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు.ఇంగ్లాండ్ బౌలర్లు ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను ఏ దశలోనూ కట్టడి చేయలేకపోయారు.భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది.ఆ జట్టులో డేవిడ్ మలన్(68:46 బంతుల్లో 98ఫోర్లు,2సిక్సర్లు) జోస్ బట్లర్(52:34 బంతు ల్లో 2ఫోర్లు,4సిక్సర్లు)మాత్రమే అర్ధశతకాలతో రాణించారు.ఒకానొక దశలో వీరిద్దరి జోరుకు ఇంగ్లాండ్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది.కీలక సమయాల్లో ప్రత్యర్థి బ్యా ట్స్‌మెన్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టుసాధించారు.ఆఖర్లో సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటం వేగంగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకుం ది.బెన్‌స్టోక్స్(14) చెలరేగా ప్రయత్నం చేసినా నటరాజన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.జేసన్ రాయ్(0),జానీ బెయిర్‌స్టో(7) ఇయాన్ మోర్గాన్(1) విఫలమయ్యారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/15) శార్దుల్ ఠాకూర్(3/45) గొప్పగా బౌలింగ్ చేశారు.’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ భువనేశ్వర్,కోహ్లీకి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...