నేటి నుంచే తెలంగాణలో సూపర్‌ స్ప్రెడర్స్‌కు వ్యాక్సిన్..

హైదరాబాద్:తెలంగాణలో ఇవాళ నుంచి సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభంకానుంది.ఇవాళ,రేపు రెండురోజులపాటు వ్యాక్సిన్ వేయనున్నారు.ఇందుకోసం అధి కారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఉదయం 10 గంటలకు సనత్‌ నగర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వ్యాక్సినేషన్‌ పంపిణీని ప్రారంభించ నున్నారు.సూపర్‌ స్ప్రెడర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.ప్రతి సర్కిల్‌కు ఒక కేంద్రం చొప్పున మొత్తం 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు.ప్రతిరోజు 32 వేల మందికి టీకా ఇవ్వనున్నారు.పది రోజుల్లోనే టీకా ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.సర్కిల్‌ లెవల్‌లో డిప్యూటీ కమిషనర్లు,మెడికల్‌ అధికారులు టోకెన్ల పంపిణీ,సెంటర్ల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్‌ కొనసా గనుంది.ప్రతి సెంటర్‌లో వెయ్యి మందికి టీకా ఇవ్వనున్నారు.రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్లు 25 లక్షల మందికిపైగా ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది.వీరందరికీ వీలై నంత త్వరగా వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించింది.డ్రైవర్లు,వీధి వ్యాపారులు,గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌,బ్యాంకు ఉద్యోగులు,పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వారు ఊరూరు తిరు గుతూ వ్యాపారం చేసేవారినంతా సూపర్‌ స్ప్రెడర్లు భావించి వీరికి టీకా వేయడానికి తెలంగాణ సర్కార్‌ రెడీ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here