నన్ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు:రామ్‌దేవ్

న్యూ ఢీల్లీ:అల్లోపతి మోడరన్ మెడిసిన్ లపై యోగా గురు రామ్ దేవ్ మరోసారి కాంట్రవర్సిషయల్ కామెంట్లు చేశారు.గురువారం తన అరెస్టుపై ఛాలెంజ్ చేస్తూ ఓ వీ డియోలో కనిపించారు.వాళ్ల బాబులు కూడా స్వామి రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయలేరు అంటూ స్వయంగా చెప్పుకున్నారు.వాళ్లు కేవలం శబ్ధం మాత్రమే చేస్తున్నారు.థ గ్ రామ్‌దేవ్ (క్రిమినల్ రామ్‌దేవ్),మహా థగ్ రామ్‌దేవ్,రామ్‌దేవ్ అరెస్ట్ లాంటి ట్రెండ్‌లు మాత్రమే క్రియేట్ చేయగలరు అని రామ్‌దేవ్ అన్నారు.స్వామి రామ్‌దేవ్‌ ను అరెస్ట్ చేయడం వాళ్ల బాబుల తరం కూడా కాదు అంటుండటం వీడియోలో రికార్డ్ అయింది.మోడరన్ మెడికల్ ట్రీట్మెంట్స్ ను కించపరుస్తూ ఆయన చేసిన కామెంట్లు కాంట్రవర్సీగా మారడంతో ఈ వివాదం మొదలైంది.ఇటువంటి ట్రీట్మెంట్ ల కారణంగానే కొవిడ్ సంక్షోభం ఏర్పడుతుందంటూ ఆరోపించారు.అల్లోపతి వాడిన ప్రజలు లక్ష ల మంది చనిపోతున్నారు.వాళ్లకు సరైన ట్రీట్మెంట్ లేక లేదంటే ఆక్సిజన్ అందక చనిపోతున్నారు అని రామ్దేవ్ మాట్లాడారు.అంతేకాకుండా అల్లోపతి అనేది మూర్ఖ మైనది విలువలేనిది అని ఆరోపించారు.వాటిని వెనక్కు తీసుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ కోరగా వెనక్కు తీసుకుంటున్నానని చెప్పారు రామ్ దేవ్. ఆ తర్వాత మళ్లీ 25ప్రశ్నలు సంధిస్తూ సమాధానం చెప్పాలని అన్నారు.దీనిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేరుగా ప్రధానిని రామ్ దేవ్‌ను అరెస్టు చేయమ ని కోరింది.టాప్ మెడికల్ బాడీ డాక్టర్లు కూడా రామ్‌దేవ్ పై పరువు నష్టం దావా కింద రూ.1000కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.అంతేకాకుండా 15 రో జుల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here