నాలుగు కాళ్ల చిన్నారికి అండగా..సోనూసూద్

ముంబై:బాలీవుడ్ నటుడు సోనూ సూద్ సహాయంతో బీహార్‌లోని నవాడాకు చెందిన రెండున్నరేండ్ల చిన్నారికి గురువారం కొత్త జీవితం వచ్చింది.నవాడా జిల్లాలోని వార్షాలిగంజ్ బ్లాక్ పరిధిలోని హే మ్డా గ్రామానికి చెందిన చౌముఖి అనే చిన్నారి తన శరీరంలో నాలుగు చేతులు,నాలుగు కాళ్లతో జన్మించింది.నవాడాలో దినసరి కూలీగా పనిచేస్తున్న ఆమె తల్లిదండ్రులు చాముముఖి శస్త్రచికిత్స కోసం సహాయం కోరుతూ కొన్ని రోజుల క్రితం ఎస్‌డీఓ కార్యాలయానికి వెళ్లారు.వారి ప్రయత్నాలు ఎటువంటి తక్షణ ఫలితాన్ని ఇవ్వలేదు.అయితే ఓ వ్యక్తి చముఖిని వీడియో తీసి సోషల్ మీడియా లో అప్‌లోడ్ చేశాడు.ఆ వీడియో చూసిన సోనూసూద్ చౌముఖి తల్లిదండ్రులను సంప్రదించడానికి తన బృందాన్ని నవాడకు పంపాడు.అతని చొరవతో,చౌముఖిని శస్త్రచికిత్స కోసం సూరత్‌లోని ఒక ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అనంతరం వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.మొత్తం ఖర్చులు సోనూసూద్ భరించాడు.చిన్నారికి ఆపరేషన్ విజయవంతం అయిన తర్వాత, సోనూ సూద్ ఆస్పత్రి బెడ్‌పై విశ్రాంతి తీసుకుంటున్న చౌముఖి ఫోటోను ట్వీట్ చేశారు.అలాగే ‘దేశంలో కష్టతరమైన శస్త్రచికిత్సలలో ఒకటి విజయవంతమైందిఅని పేర్కొన్నాడు.సూరత్‌లోని కిరణ్ ఆ స్పత్రికి,విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.చౌముఖి తల్లిదండ్రులు తమ కుమార్తెకు కొత్త జీవితాన్ని ఇచ్చినందుకు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here