జమ్మికుంట:ఒకవైపు డెంగీ కేసులు పెరుగుతున్నాయి.ప్రస్తుతం కొవిడ్ covid-19 ముప్పు కూడా పూర్తిగా పోలేదు.దీని కంటే డెంగీ భయంకరంగా ఉంది.వీటి కొత్తరకం వేరియంట్లు ఇలా భయపడటానికి కారణం.కొన్ని నిజాలు ఇటీవలె నిపుణులు బయటపెట్టారు.అపోహలు డెంగీ..కరోనా వలె కాకుండా తేలికైన ఇన్ఫెక్షన్?కరోనా సమయంలో డెంగీ జ్వరం కూడా వ్యాప్తి చెందుతోంది.అందుకే ఈ లక్షణాలు కాస్త గందరగోళంగా ఉన్నాయి.రోగనిర్ధారణ,చికిత్సకు ఆలస్యం మాత్రమే కాదు కరోనా మాదిరి ఇది ప్రాణాంతక ఇన్ఫెక్షన్ కాదని భావిస్తారు.అ యితే,బ్రేక్‌బోన్ ఫీవర్ అని పిలిచే డెంగీ చాలా ప్రమాదకరమైంది.సకాలంలో వైద్యం తీసుకోకపోతే అనేక సమస్యలకు కారణమవుతుంది.డీ2 సెరోటైప్ అని పిలుస్తున్న కొత్త వేరియంట్‌లో తీవ్రమైన లక్షణాలతోపాటు జ్వరం,అనేక సందర్భాల్లో మరణం కూడా సంభవిస్తుంది.డెంగీ తీవ్రమైన లక్షణాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు,రక్తం గడ్డకట్టడం,కిడ్నీఫెయీల్యూర్, మతిమరుపు వంటివి సంభవిస్తున్నాయి.డెంగీ,కొవిడ్ రెండు ఒకేసారి రావు?డెంగీ,కొవిడ్ రెండు కలిపి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.అందుకే ఏ కొద్దిపాటి లక్షణా లు కనిపించినా పరీక్ష చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు.కొవిడ్,డెంగీలో కొన్ని లక్షణాలు సాధారణం.ఇవి రెండు కలిసి వస్తే శరీరంపై తీవ్ర ఒత్తిడి కలుగుతుంది.అందుకే కొవిడ్ నియమాలను ఇంకా పాటించాలని చెప్పేది.ఏ దోమ కుట్టినా..డెంగీ వస్తుందా?డెంగీ వైరస్ సోకిన దోమకాటు వల్ల ప్రధానంగా వ్యాపిస్తుంది.కానీ,ప్రతీ దోమకాటు డెంగీ అని అనుకోకూడ దు.డెంగీ కేవలం ఏడిస్ దోమ వల్ల కలుగుతుంది.అది కూడా ఆడది.మగ ఏడిస్ కాటువేయదు.నిపుణుల అభిప్రాయం ప్రకారం దోమ కాలు వేసిన వారం రోజుల వరకు వైరస్‌ను తీసు కెళ్లగలదు.ఇతరులకు వ్యాపింపజేస్తుంది కూడా ఇవి కేవలం పగటిపూట ఎక్కువ స మయం మోకాలి కింద,చీలమండలం లేదా మోచేతుల చుట్టూ కొరుకుతుందని వైద్యులు చెబుతు న్నారు.కేవలం పిల్లలు,వృద్ధులకే డెంగీ ప్రమాదం?డెంగీ ఇన్ఫెక్షన్ వీరికి తీవ్రంగా ఉండవచ్చు.కానీ,కేవలం వారికి మాత్రమే సోకుతుందని తప్పుగా భావించకూడదు.ఈ రెండు వయస్సు ల వారు మాత్రమే కాదు.బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న ఆరోగ్యవంతులు కూడా డెంగీ బారిన పడవచ్చు తీవ్రమైన లక్షణాలు అభివృద్ధి చేయవచ్చు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...