హనుమకొండ:తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదట దళితులకు ద్రోహం చేసింది సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు.రాష్ట్రానికి దళితుడినే మొద టి సీఎంను చేస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు.హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లి,మర్రిపల్లిగూడెం,జూజునూరు,వంగపల్లి,పంగిడిపల్లి,లక్ష్మీపూర్ గ్రా మాల్లో గురువారం ఈటల ఎన్నికల ప్రచారం చేశారు.దళితలకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని చెప్పారు.ఇప్పుడు కేసీఆర్ దళిత బంధు ఇస్తుంటే,ఇతరులు ఆపుతున్నట్లుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.తాను రాజీనామా చేస్తేనే దళిత బంధు వచ్చిందని,అలాంటిది తన దిష్టి బొమ్మలను ఎందుకు తగల బెడుతున్నారని ప్రశ్నించారు.దళిత బంధు ఆపాలని తాను ఎవరికీ లేఖ రాయలేదని చెప్పారు.సీఎం కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు,మనవడు రాష్ట్రాన్ని ఏలాలనే ఎజెండాతో పనిచేస్తున్నారని ఆరోపిం చారు ఈటలను కొట్టగలిగే శక్తి కేసీఆర్‌కే కాదు,ఆయన జేజమ్మకు కూడా లేదని అన్నారు.