నాకు గుర్తింపు ఇవ్వనందుకే రాజీనామా:మోత్కుపల్లి

హైదరాబాద్‌:మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భాజపాకు రాజీనామా చేశారు.హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేరకు వెల్లడిం చారు.తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు చెప్పారు.తన అనుభవాన్ని,సుదీర్ఘ రాజకీయ చరిత్రను దృష్టిలో పెట్టుకుని అయినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు.కనీసం భాజపా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగానూ అవకాశం ఇవ్వలేదని ఆక్షేపిం చారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను పార్టీలో చేర్చుకున్నపుడు తనకు ఒక్కమాట కూడా అడగకపోవడం ఇబ్బందికి గురిచేసిందన్నారు.సీఎం కేసీఆర్‌ నిర్వహించిన దళిత సాధికారత సమావేశంలో తన అభిప్రాయాలు తెలిజేయాల్సిందిగా ఆహ్వానిస్తే బండి సంజయ్‌కు చెప్పే వెళ్లానని అయినా పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడం తన ను బాధించిందన్నారు.ఈ పరిణామాల నేపథ్యంలో భాజపాకు రాజీనామా చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు.కేసీఆర్ తీసుకొచ్చిన ఒక పథకాన్ని తాను ప్రశంసిం చడం బీజేపీ నేతలకు మింగుడుపడలేదని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here