వరంగల్‌ ఆత్మగౌరవ కాంగ్రెస్‌సభకు..హాజరుకానున్న రాహుల్‌ గాంధీ

హైదరాబాద్:సెప్టెంబర్‌ రెండో వారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు.దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా చివరి సభ వరంగల్‌లో ని ర్వహించనున్నట్లు,ఆ సభకు రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారని కాంగ్రెస్‌ నాయకులు ప్రకటించారు.గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,రాష్ట్ర ఇంచార్జి మాణికమ్‌ టాగూర్‌,సిఎల్పీ నేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల కోఆర్డినేటర్ల సమావేశంలో దళిత గిరిజన దండోరా పార్టీ పనితీరుపై చర్చించారు.సె ప్టెంబర్‌ 10 నుంచి 17 మద్య దండోరా సభ వరంగల్‌లో నిర్వహించాలని దానికి రాహుల్‌ గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ఏఐసిసి కార్యక్రమాల అమలు క మిటీ చైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్‌ కచ్చితంగా 72 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్‌ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నాయని తెలిపారు ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావ డం ఖాయమని ఎవరు ఆపలేరని రేవంత్‌ స్పష్టం చేశారు.యూత్‌,ఎన్‌ఎస్‌యూఐ,ఎస్సీ,ఎస్టీ విభాగాల నుంచి 119 ఇంఛార్జీలను నియమించుకోవాలని సూచించారు. ఇంద్రవెల్లి,రావిర్యాల సభలను కార్యకర్తలు విజయం చేశారని,దాని వల్ల పార్టీ చాలా బలోపేతం అయ్యిందన్నారు.సెప్టెంబర్‌ 10 నుంచి 17 లోపు తెలంగాణ లో రాహు ల్‌ గాంధీ పర్యటన ఉంటుందని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here