హుజురాబాద్ ఇంచార్జీలతో కేసీఆర్ భేటీ

హైదరాబాద్:హుజురాబాద్‌ ఉప ఎన్నిక చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి.మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైన సంగ తి తెలిసిందే.ఇటు నేతలు కూడా బిజీ బిజీగా ఉన్నారు.ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు.సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ఇన్‌ ఛార్జీలతో శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు.సెగ్మెంట్‌ స్థితిగతులపై ఇన్‌ఛార్జీలను అడిగి తెలుసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకాన్ని గ్రౌండ్‌ లెవల్‌లో సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించినట్లు తెలిసింది.ఇన్‌ఛార్జీలు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.హు జూరాబాద్‌లో చేపట్టబోయే వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు సమాచారం.ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రైతుబీమా,రైతుబంధు,కల్యాణలక్ష్మి,ఉచిత కరెంటు,కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో చైతన్యం వచ్చేలా చూడాలన్నారు.ప్రతి టీఆర్‌ఎస్‌ కార్యకర్త కష్టపడి పనిచేసేలా కృషి చేయాలని కేసీఆర్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here