దళిత బంధును రాష్ట్ర మంతా ఇవ్వాలి:మాజీ మంత్రి ఈటల

హుజురాబాద్:హుజురాబాద్ మధువని గార్డెన్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ హాజరైన హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి,బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి,హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి,కరీంన గర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి హాజరయ్యారు.ఈటల రాజేందర్ మాట్లాడుతూ:కేసీఆర్ ధర్మాన్ని,న్యాయాన్ని,నాలాంటి ప్రజలతో మమేకమైన వ్యక్తిని చెడిపే ప్ర యత్నం చేసి,తానే చెడిపోయే పరిస్థితి వచ్చింది.చెడపకురా చెడేవు అనే సామెత ఇప్పుడు కేసీఆర్ పట్ల నిజమైంది.సంపద పోయినా,ఆరోగ్యం పోయినా కొంతవరకే నష్టం కానీ క్యారెక్టర్ పోతే అన్ని పోయి నట్లేనని ఇంగ్లీష్ సామెత ఉంది.కేసీఆర్ నోటి నుంచి ఏ మాట వచ్చినా ఎవరూ నమ్మలేని పరిస్థితి వచ్చింది.ఓ వైపు కేసీఆర్ మాట్లాడుతుంటే మరివైపు ఇవన్నీ అబద్ధాలేనని మొన్నటి సభలోనే మహిళలు మాట్లాడుకుంటున్నారు.ఎంత మేధావైనా,అనుభవమున్నా తన పట్ల ప్రజలు ఏమను కుంటున్నారో కేసీఆర్ తెలుసుకునే అవసరం ఉంది.మంత్రులు,ఎ మ్మెల్యేలు,దగ్గరి వాళ్లు ఎవరు చెప్పినా పట్టించుకోని క్యారెక్టర్ ఆయనది.చరిత్రలో రాజులను,చక్రవర్తు లను ప్రజలను నేరుగా కలుసుకోకపోయినా మారువేషాల్లోప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేవాళ్లు.గతంలో ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించి,ప్రజల ను కలిసే అవకాశం ఉండేది.కానీ ఈ సీఎం ప్రజాదర్బార్ రద్దు చేసారు.ఏ ముఖ్యమంత్రైనా ఆఫీ సుకు వచ్చి మీటింగ్ పెట్టే సంస్కృతి ఉండేది.కానీ ఈయన మాత్రం ఆఫీ సుకు రారు.సీఎంకు ఇంటెలిజెన్స్ రిపోర్టులు రావ డం లేదా? ఆయన ప్రతిష్ఠ అథ:పాతాళానికి పడిపోయింది.ఇండియా టుడే సర్వేలో ఆయనకిచ్చిన స్థానం చూసైనా పరి స్థితి అర్థం చేసుకోవాలి.ఎక్కడ తప్పు జరిగిందో,ఎందుకు జరిగిందో అంచనావేసుకుని రెక్టిఫై చేసుకోవడం లేదు.హుజురాబాద్ లో ప్రజాస్వామ్యానికి మచ్చతెచ్చేలా టీఆర్ఎస్ నేతలు,ముఖమంత్రి ప్రవర్తిస్తున్నారు.చక్రవర్తులు,రాజులు గొప్ప పనులు ప్రజల మన్ననలు పొందారు.వందల ఏళ్ల క్రితం ఆశోకుడు చెట్లు నాటిస్తే ఇప్పటికీ చరిత్ర పుస్తకాల్లో చదువుకుంటాం.కానీ కేసీఆర్ పాలన గురించి చరిత్రలో వందల కోట్లు పెట్టి సొంత పార్టీ నేతలనే కొన్నారని చదువుకోవాల్సి ఉంటుంది.ఏదైనా పథకం తెస్తే రాష్ట్రమంతా తేవాలి.కానీ ఒక్క హజురాబాద్ ఉపఎన్నికల కోసమే కుళ్లుబుద్ధితో నన్ను ఓడించేందు కు దళిత బంధు తెచ్చారు.ఇప్పటికే వాసాలమర్రిలో దళిత బంధు ప్రారంభించామని చెప్పి మళ్లీ ఆర్భాటంగా ఇక్కడ సభ పెట్టి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.1.7 లక్షల కోట్లు దళితబంధుకు అవసరమని మీరే చెప్పాలి.కానీ 2 లక్షల కోట్లు దాటు తుంది.ఇన్ని కోట్ల నిధులు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయా?రాష్ట్ర బడ్జెట్ లో ఏటా జీతభత్యాలు 40-45 వేల కోట్లు,తెచ్చిన అ ప్పులకు వడ్డీ,అసలు కలిపి 56 వేల కోట్లు(ఏటేటా పెరుగుతుంది) కావాలి.ఈ రెండు కలిపే లక్ష కోట్లు దాటుతుంది.రైతు బంధు,కరెంట్ సబ్సిడీ,బియ్యం సబ్సిడీ,కేసీఆర్ కిట్స్ కోసం మరో 35 వేల కోట్లు కావాలి.మరి మన ఆదాయమెంత? ఇవ న్నీ పోనూ మిగిలేదెంత?మరి దళిత బంధుకు డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు.ఖజానా డబ్బులో లేకుండా మీరు ఎలా ప్రకటనలు చేస్తున్నారు?ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవంలో మీకు దళితుల పరిస్థితి ఇంతకాలం తెలియదా?నూటికి 85 శాతం ప్రజలు బలహీన వర్గాలే ఉన్నాయని మీరే చెప్పారు కదా?8 ఏళ్లుగా గుర్తురాని దళితజాతి మీద మీకు హఠా త్తుగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అందరికీ తెలుసు 0.2 శాతం జనాభా ఉన్న మీ సామాజిక వర్గానికి ఉన్న మంత్రి పదవులెన్ని,ఇతర కులాలకు జనాభా వారిగా ఉన్న మంత్రి పదవులెన్ని? 0.2 శాతం ఉన్న మీకు నాలుగు మంత్రి పదవులు, 15 శాతం జనాభా ఉన్న ఎస్సీలకు ఒకే మంత్రి పదవా?రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అన్నది మీరే తల నరుక్కుం టానన్నది మీరే.ముఖ్యమంత్రి ఇవ్వకపోగా ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లే ఇచ్చి తీసేశావు.సీఎంవో ఆఫీసు అన్ని వర్గాలకు,జాతులకు కేంద్రంగా ఉంటుంది.కానీ ఇన్నేళ్లుగా ఒక్క ఎస్సీ, ఎస్టీ,బీసీ,మైనార్టీ ఐఏఎస్ ఫీసర్ లేరని గతంలోనే అడిగా.కానీ ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే రాహుల్ బొజ్జాకు సీఎంవోలో స్థానం ఇచ్చారు.నా రాజీనామా వల్ల ఇన్ని ఫలితాలు వస్తు న్నందుకు గర్వంగా ఉంది.రాహుల్ బొజ్జాతో పాటు ఎస్టీ,బీసీ,మైనార్టీ అధికారులకు కూడా సీ ఎం వో ల స్థానం ఇవ్వాలి.అదేవిధంగా జనాభా ప్రాతిపదికన మంత్రి పద వులు కూడా కేటాయించాలి.నేను ఓపెన్ డిబెట్ కు సిద్ధం గా ఉన్నా అన్నీ ఖర్చులు పోనూ మీరు దళితబంధుకు కనీసం 10 కోట్లైనా కేటాయించే సత్తా మీకుందా?మీరు చెప్పిన లక్షా 70 వేలు ఖర్చు చేయాలంటే 17 ఏళ్లు కావాలి.ఇప్పటికే మూడేళ్లు గడిచింది.ఇంకా రెండేళ్లలో ఎంత ఖర్చు చేస్తారు.17 ఏళ్లు మీకు అధికారం ఇస్తామని ప్రజలు రాసీయలేదు.కేవలం దళితుల ఓట్లమీద ప్రేమతో హైటెక్ సిటీ దగ్గర అమ్మిన భూముల ద్వారా వచ్చిన పైసలను ఇక్కడ ఖర్చు చేస్తున్నారు.మీరు అమ్మిన భూమి చెల్లే ఆస్కారం లేదని,వాళ్ల డబ్బులు వాపస్ ఇవ్వాలని కోర్టు చెప్పింది.వాసాల మర్రిలో వచ్చిన డబ్బులే వాళ్లకు ముట్టలేదు.కేవలం ఆ డబ్బులు కలెక్టర్ దగ్గరే ఉన్నాయని తెలిసింది.హుజురాబాద్ లో ఇచ్చే సాంక్షన్ లెటర్లు కూడా ఉత్త లెటర్లుగా ఉంటాయా అన్న అనుమానం ఉంది.నీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫి కేషన్ రాకముందే దళితులందరికీ 10 లక్షలు అకౌంట్లో వేయాలి.ఎవరి అజమాయి షీ లేకుండా వాళ్లు స్వేచ్ఛగా డబ్బులు ఖర్చు చేసుకునే అవకాశం ఇవ్వాలి.రైతు బంధు ఇచ్చినట్లుగానే దళిత బంధును రాష్ట్ర మంతా దళిత బిడ్డలకు ఇవ్వాలి.సంచార జాతులు,అన్ని వర్గాల్లోని నిరుపేదలకు కూడా పది లక్షల చొప్పున ఇవ్వాలి. ఆకలి కేకలులేని,సుసంపన్నమైన రాష్ట్రం రావాలంటే అందరికీ ఫలాలు దక్కాలి.మీకు మనస్సు ఉంటే ఇవన్నీ చేయాలి.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామంటే ప్రజ లు మిమ్మల్ని నమ్మారు.కానీ ఏ పూటకు ఆపూట అక్కర తీర్చుకునే మాటలు చెబుతూ ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు.ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి మోసపు మాటలు నమ్మొద్దు.మొన్నటి సీఎం సభకు హుజురాబాద్ లోని దళితులు రాలేదు.ఇతర జిల్లాల నుంచి తరలించారు.వాళ్లు వస్తే గొడవ చేస్తారని బస్సుల న్నీ రోడ్లుపైనే ఆపేసారు.మీ ప్రసంగంలో పసలేక ప్రజల నుంచి స్పందన కరువైంది.మీరు ఎవరి మాట వినరు,ఇంటెలిజెన్స్ రిపోర్టు చదివి ఉండరు కావచ్చు.కానీ మీ పనితీరుకు ఇండియా టుడే సర్వే నిదర్శనం.ఇక్కడ ప్రజలు చైతన్యానికి ప్రతిరూపాలు.అందుకే మీ మోసపు మాటలు నమ్మరు.కేసీఆర్ కు వ్యతిరేకంగా ఎవరైనా సోష ల్ మీడియాలో మాట్లాడితే పోలీసులను పంపించి బెదిరిస్తున్నారు.ఇక్కడి ప్రజలు ప్రేమకు లొంగుతారు బెదిరిస్తే తిరగబడుతారు.ఇప్పటికే 200 కోట్లు మీరు ఖర్చు చేయగా,మీటింగ్ కోసం ప్రజాధనం 30 కోట్లు ఖర్చు చేసారు.ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రొటోకాల్ కు సంబంధం లేకుండా సీఎం సభ వేదికపై కూర్చున్నారు.హుజురా బాద్ లో ఎగిరేది కేవలం కాషాయ జెండానే గెలిచేది పువ్వు గుర్తుపై నేను మాత్రమే 18 ఏళ్లుగా ఇక్కడి ప్రజల కాళ్లలో,కళ్లలో మెదిలిన బిడ్డను నేను.వాళ్లకు అన్ని విషయాలు తెలుసు.మీకు దమ్ముంటే ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నికలు జరపండి.మీకు ఎన్ని ఓట్లు వస్తాయో,మాకు ఎన్ని వస్తాయో తెలుస్తుంది.మీ మంత్రులను, పోలీసులను ఉపసంహరించుకుని ప్రజల్లోకి రండి.మళ్లీ వస్తానని మొన్న సీఎం ప్రకటించారు.తన స్థాయిని తగ్గించుకుని మండలాల్లో కూడా తిరుగుతామని చెబుతు న్నారు.మీరు మండల స్థాయిలో కాదు ఊరూరికి తిరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యవహరిస్తే మీకు డిపాజిట్ కూడా రాదు.ఏదైనా స్కీం వస్తే కేవలం ఒక్క నియోజకవ ర్గానికే వస్తుందా? కేసీఆర్ జీవితంలో ఏనాడైనా జై భీం అనే స్లోగ న్ ఇచ్చాడా?ఇప్పుడు ఇస్తున్నావు ఏడేళ్లలో లేనిది ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి,జగ్జీవన్ రాంకు తొలిసారిగా ఆయన దండలు వేస్తున్నారు.ఏనాడు అంబేద్కర్ జయంతులకు, వర్ధంతులకు రాలేదు.ఆకునూరి మురళి,ఆర్.ఎస్.ప్రవీణ్ కుమా ర్ లాంటి వాళ్లు ఎందు కు రాజీనామా చేసారు.గొప్పగా సోషల్ వెల్ఫేర్ లో పనిచేసారు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ డేళ్లుగా డైట్ ఛార్జీలు రావడం లేదని,ఇన్ ఫ్రాస్టక్చర్ కొనడం లేదని రాజీనామా చేసారు.ఆయన కదలిలపై మూడు వాహనాల్లో పోలీసులను తిప్పుతున్నారు,నా వెంట ఆరు వాహనాలు తిప్పుతున్నారు.నాకు ఏ అలవాట్లు లేవు కాబట్టి నేను బతి కి పోయాను.నేనంటే రాజకీయ నాయకున్ని ఆర్.ఎస్.కుమార్ ఏం తప్పు చేసాడని నిఘా పెట్టావు.ప్రదీప్ చంద్ర ఈ రాష్ట్రాని కి సీఎస్ గా పనిచేసిన ఆణిముత్యం టీఎస్ ఐపాస్ సృష్టికర్తగా ఉంటే ఆయన పదవీ విరమణకు కూడా సీఎం రాకుండా అవమానించారు.సీఎస్ గా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్లందరికీ సర్వీసు పొడగింపు ఇచ్చినా ప్రదీప్ చంద్రకు ఇవ్వలేదు.ఎంతమంది దళిత బిడ్డలకు మీరు మంచి పోస్టింగ్ లు ఇచ్చారో చెప్పగలరా బయటి వాళ్లు తప్ప తెలంగాణ ఉద్యమంలో మనకు సహాయం చేసిన అధికారులు ఎవరూ ఇక్కడ కీలక పదవుల్లో లేరు.ఇప్పుడు ఇది ఎడ్డి తెలంగాణ కాదు చైతన్య వంతమైన తెలంగాణలో మీ మాటలు నమ్మే ప్రసక్తి లేదు.రాజకీ యాల్లో లెఫ్ట్,రైట్ అంటూ భావాలు స్థిరంగా ఉండవు.ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ బీజేపీ అని నమ్మాను కాబట్టే ఇం దులోచేరాను.మా బావ మరిది ఏదో అన్నాడని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారు.ఇవాళ కూడా కొంతమంది కిరాయి మనుషులతోటి దళితులను నేను ఇబ్బందులు పెట్టినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.హుస్నాబాద్ వాళ్ళతో మాట్లాడించి పోస్ట్ లు పెట్టిస్తున్నారు.నేను ఏనాడైనా ఎవరినైనా వేధించానా? ఇ లాంటి చిల్లర వేషాలు బంద్ చేయండి. సూర్యుని మీద ఉమ్మేస్తే మీమీద పడ్డట్లే ఇప్పుడు నన్ను విమర్శిస్తే మీకు భంగపాటు తప్పదు.ఇలాంటి కిరాయి మన షులతో నా క్యారెక్టర్ ను బదునామే చేసే చిల్లర వేషాలు బంద్ చేయండని ఈటల అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here