హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన ఇనాళ్లకి ఉద్యోగాలకు స్థానికత అంశానికి ఇప్పుడు లైన్ క్లియర్ అయ్యింది.కొత్త జోనల్ సిస్టమ్‌కు రాష్ట్రపతి ఆ మోదంతో రాష్ట్రంలోని 95శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయ్యింది.రాష్ట్రంలో 33 జిల్లాలు,ఏడు జోన్లు,రెండు మల్టీ జోన్లతో కూడిన కొత్త జోన ల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.ఈ నిర్ణయంతో అన్ని రకాల పోస్టుల్లోనూ ఓపెన్ కోటా 5 శాతం మాత్రమే ఉంటుంది.పోలీసు విభాగం మినహా ఇతర శాఖల న్నింటికీ కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది.వాస్తవానికి 2018లోనే కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించినా తర్వాత ప్రభుత్వం మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది,వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్చగా ఈ మార్పులకు రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి రావడంతో మొత్తం ప్రక్రియకు ఆలస్యమైంది.రాష్ట్రపతి ఆమోదంతో కొత్త జోనల్ విధానం అమల్లోకి రాబోతుంది.రాష్ట్రంలో ఇప్పటివరకు కొన్ని కేటగిరీల్లో 100 శాతం పోస్టులు ఓపె న్ కేటగిరీలోనే ఉన్నాయి.గ్రూప్-1లోని డిప్యూటీ కలెక్టర్,డీఎస్పీ,కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి రాష్ట్రస్థాయి (స్పెసిఫైడ్ గెజిటెడ్ కేటగిరీ) పోస్టుల్లో 100 శాతం ఓపె న్ కోటానే భర్తిచేస్తారు.కొన్ని రాష్ట్రస్థాయి పోస్టుల్లో 50 శాతం ఓపెన్ కోటా కిందే ఉన్నాయి.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...