మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం:అల్లం నారాయణ

హైదరాబాద్:సీనియర్‌ జర్నలిస్టు,ఐజెయూ నాయకులు,ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు కోసూరి అమర్ నాథ్ ఆకాల మరణానికి నా సంతాపం.మూడు దశబ్దాలకుపైగా జర్నలిస్టు నాయకుడిగా జర్నలిస్టుల సమస్య లను పరిష్కరించడానికి ఆయన నిరంతరం కృషి చేశారు.ఆయన మృతి జర్నలిస్ట్ యూనియన్లకు,తె లుగు జర్నలిస్టులకు తీరని లోటు.జర్నలిస్టుల యూనియన్లకు సం బంధించి చట్టపరమైన అంశాల అన్నింటిలో నిష్ణాతుడిగా ఉండి, ట్రిబ్యునల్స్ వాటి సిఫారసుల అ మలు గురించి యాజమాన్యాల మధ్య వచ్చిన వివాదాలకు ఒక నిపుణు డిగా ఆయన విలువైన సలహాలు ఇచ్చేవారు.అలాంటి అమర్ నాథ్ కరోనాకు బలవ్వడం దు రదృష్టకరం.ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటిస్తూ అమర్ నాథ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.టీ యుడబ్ల్యూజె అధ్యక్షుడిగా,తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ గా ఆయనకు నా నివాళులు.కరోనాతో గత రెండు రోజులలో నే అదిలాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ సాయినాథ్,వేములవాడకు చెందిన జర్నలి స్ట్ బూర రమేష్,కరీంనగర్ జిల్లాకు చెందిన జర్నలిస్ట్ పడకంటి రమేష్,దురదృష్టవ శాత్తు మరణించారు.వారందరికీ నా నివాళులు.జర్నలిస్టులు కరోనా తీవ్రత దృష్ట్యా పరి స్థితులను అర్థం చేసుకుని కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అల్లం నారాయణ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here