హైదరాబాద్:ఇండియాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది.ప్రతిరోజూ లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవు తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.నిబంధనలు ఖచ్చితంగా ఫా లో కాకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.అటు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు,రాజకీయ నాయకులు,సినీ స్టార్లకు కరోనా సోకింది.ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత,భద్రతా సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.సిబ్బందికి కరోనా సోకడంతో పవన్ కళ్యాణ్ ముందుజాగ్రత్తలో భాగంగా క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.అయితే తాజాగా పవన్ పరిస్థితి కాస్త అదుపు తప్పిందని సమాచారం.పవన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవే ట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు.ఈ పరీక్షల్లో ఆయనకు ఊపిరితిత్తుల్లో స్వల్పంగా ఇన్ఫెక్షన్ కు గురైనట్లు తేలింది.దీంతో ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.