నేటి నుంచే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ:ఇవాళ్టి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలు కానున్నాయి.ఈ సమావేశాల్లో కేంద్రప్రభుత్వం 29 సాధారణ బిల్లులు,రెండు ఆర్థిక బిల్లులను ఉ భయ సభల ఆమోదం కోసం ప్రవేశపెట్టనుంది.ఇందులో మూడు బిల్లులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకురావడానికి ఉద్దేశించినవి.రక్షణ ఉత్పత్తుల సంస్థల్లో పనిచేస్తున్నవారు నిరసనలు తెలుపకూడదు అన్న వివాదాస్పద బిల్లు కూడా ఈ జాబితాలో చేర్చింది కేంద్ర ప్రభుత్వం.అలాగే,సెన్సార్‌ బోర్డు నిర్ణయాన్ని సమీక్షించేలా కేంద్రానికి అధికారం కల్పించే కొత్త సినిమాటోగ్రఫీ బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది.మరోవైపు,కరోనా కట్ట డి,మౌలిక వైద్య సదుపాయాల కల్పనలో కేంద్రం వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి.అలాగే,వ్యవసాయ చట్టాలు,సరిహద్దుల్లో చైనా దూకు డుపై మాటల దాడి చేయడానికి ప్రతిపక్షాలు అస్ర్తాలను సిద్ధం చేసుకొంటున్నాయి.అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలపై పార్లమెంటు వేదికగా కేం ద్రాన్ని నిలదీయాలని నిర్ణయించాయి.అయితే అన్ని అంశాలపై ఆరోగ్యకరమైన,అర్థవంతమైన చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఇప్పిటకే క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ సమావేశాల సమయంలో పార్లమెంటు వద్ద రైతులు తమ నిరసనగళం వినిపిస్తారని కిసాన్‌ సంయుక్త మోర్చా ఇదివరకే ప్రకటించింది.సెషన్‌లో సా మాజిక దూరాన్ని కొనసాగించే అన్ని కోవిడ్ సంబంధిత ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు.ఇంకా టీకాలు తీసుకోని వారు పార్లమెం టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య కేంద్రంలో ఆర్టీ-పీసీ ఆర్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు.కోవిడ్ వ్యాక్సిన్ కనీసం ఒక మోతాదు పొందిన వారు ఆ ర్టీ-పీసీఆర్ పరీక్షను చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.తాజా సమాచారం ప్రకారం,లోక్‌సభ నుండి 444 మంది,రాజ్యసభ నుండి 218 మంది సభ్యు లు కనీసం ఒక్క డోస్ టీ కాలు వేయించారు.అలాగే కోవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా సందర్శకులకు అనుమతి లేదని స్పీకర్ కార్యాలయం తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here