హైదరాబాద్:దేశ వ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ మంటలు చెలరేగుతున్నాయి.అటు మెట్రో నగరాలతోపాటు అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి కనపిస్తోంది.ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్,డీజిల్ ధరల్లోనూ హెచ్చు తగ్గులు ఉన్నాయి.గురువారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో పెట్రో పరుగు కొనసాగుతోంది.ఇదిలాఉంటే తెలంగాణలోని వరంగల్ మినహా అన్ని కేంద్రాల్లో డీజిల్ ధర సెంచరీ దాటింది.హైదరాబాద్ కంటే మేందే కరీంనగర్లో రూ.100.06కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో మార్పుల వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్,డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి.తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్,డీజిల్ ధరలు..తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.40గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.100.13గా ఉంది.కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.27గా ఉండగా లీటర్ డీజిల్ ధర ధర రూ.100.01గా ఉంది.ఖమ్మంలో పెట్రోల్ ధర రూ.107.48గా ఉండగా డీజిల్ ధర రూ.100.19గా ఉంది.మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.50గా ఉండగా డీజిల్ ధర రూ.100.23గా ఉంది.రంగారెడ్డి జిల్లాలో లీటర్ పె ట్రోల్ ధర రూ.107.41 ఉండగా డీజిల్ ధర రూ.100.14గా ఉంది.వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.91 పలుకుతుండగా లీటర్ డీజిల్ ధర రూ.99.67గా ఉంది.దేశ వ్యాప్తం గా పెట్రోల్, డీజిల్ ధరలు..దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.103.24 గా ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.91.77 లకు లభిస్తోంది.ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.25కు లభిస్తుండగా లీటర్ డీజిల్ ధర రూ.99.55గా ఉంది.కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.103.94 చొప్పున ఉండగా డీజిల్ ధర రూ.94.88 గా ఉంది.చెన్నైలో పెట్రోల్ ధర రూ.100.86 ఉండగా డీజిల్ ధర రూ.96.37గా ఉంది.బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.106.83 పలుకుతుండగా డీజిల్ ధర రూ.97.40గా ఉం ది.లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.22 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.92.13గా ఉంది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...