ఆక్రమణలకు గురవుతున్న..బెత్తం చెరువు

వరంగల్:వరంగల్ అర్బన్ జిల్లా కిలా వరంగల్ మండలం తిమ్మాపురం లోని బెత్తం చెరువు ఆక్రమణలకు గురవుతున్నది.ఖమ్మం,వరంగల్ జాతీయ రహదారికి సమీ పంలో ఉన్న ఈ చెరువు కొన్నాళ్లుగా అధికార పార్టీకి చెందిన నేతలు ఇష్టానుసారంగా కబ్జా చేస్తున్నారు.సర్వేనెంబర్ 241 లో ఉన్న చెరువు ఒకప్పుడు 115 ఎకరా ల విస్తీర్ణంతో ఉండేది కాలక్రమంలో కబ్జాలకు గురవుతు ప్రస్తుతం కేవలం 40 ఎకరాలకు కుచించుకు పోయింది 75 ఎకరాల చెరువు భూమి అన్యాక్రాంతం అయ్యింది. నేటికీ ఆక్రమణలు ఆగలేదు.మొత్తం చెరువుని ఆక్రమించి మాయం చేసే కుట్రలు జరుగుతున్నాయి.కబ్జాదారులకు అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల అం డదండలతో రెచ్చిపోతున్నారు.చెరువు నడిమధ్యలో కూడా రాళ్లు పాతుకుని హద్దులు ఏర్పాటు చేసుకోవడం వారి ధైర్యానికి నిదర్శనమని చెప్పాలి.చెరువులో నీరు నిలువకుండా ఏకంగా మత్తడిని తొలగించేశారు.ఆక్రమించిన స్థలంలో కి నీరు రాకుండా పైపులతో తూము ఏర్పాటుచేసి నీటిని పల్లానికి మళ్లిస్తున్నారు.అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలతో,ఆక్రమించిన చెరువు స్థలాన్ని క్రమబద్ధీకరించు కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే కొంతమంది ఎకరాలకు ఎకరాలు కబ్జా చేసి కొని క్రమబద్దీకరించి ఆక్రమించి మాయంచేసే కుట్రలు చేసి ప్రహరీలు కట్టుకోవడం గమనార్హం.ఇంకా వందల సంఖ్యలో మండల రెవెన్యూ కార్యాలయంలో దరఖా స్తు దాఖలు అవుతున్నాయి.మరోవైపు హిందూ క్రైస్తవ స్మశాన వాటిక లను ఏర్పాటు చేయడం వెనుక అధికార పార్టీకి చెందిన కబ్జా నేతల కుట్ర దాగి ఉందని స్థాని కులు ఆరోపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here