పోస్టింగులు ఇవ్వాలని..ప్రగతి భవన్‌ వద్ద నర్సింగ్‌ అభ్యర్థుల నిరసన

హైదరాబాద్‌:అర్హతలు కలిగి,ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి చేసుకున్న తమకు పోస్టింగులు ఇవ్వాలని నర్సింగ్ అభ్యర్థులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు.20 17లో 3,311 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక 2,418 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని వాపోయారు.మిగిలిన 893 మందికి అర్హత ఉన్నప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదని ప్రగతిభవన్ వద్ద వారు ఆందోళనకు దిగారు.రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న ఈ విపత్కర పరిస్థితుల్లో పోస్టింగులు ఇవ్వాలని తమ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here