ముందు..నీ వియ్యంకుడు(పాకాల హరినాథరావు)వెలమదొరనా..?ఎస్టీనా..?తేల్చు:రేవంత్ రెడ్డి

హైదరాబాద్:అసైన్డ్ భూముల్లో ఈటల కోళ్ల ఫాం కట్టడం తప్పే.అందులో ఏది నిజం ఏది అబద్దం అనేది కోర్టు తేలుస్తుంది.ఆరోపణలు వచ్చినందుకే మంత్రిపదవి నుం డి తీసేశారు.మరి కేటీఆర్ కు స్వయంగా పిల్లనిచ్చిన మామ ఎస్టీ అని చెప్పి తప్పుడు దృవీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తే ఎందుకు ఎవరిపై చర్యలు తీసుకోలేదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించాడు.పాకాల హరినాథరావు తండ్రి పాకాల వెంకట్రావ్ వెలమ దొర ఆయన ఎస్టీగా దొంగ పత్రం తెచ్చుకొని ఉద్యోగం చేస్తే చర్యలు ఎందుకు ఉండవని రేవంత్ ప్రశ్నించారు.ఈ పాకాల హరినాథరావు కూతురే కేటీఆర్ భార్య శైలిమ అని రేవంత్ స్పష్టం చేశారు.ఆయన ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నాడని కేసీఆర్ ఎందు కు చర్యలు తీసుకోలేదని నీ వియ్యంకుడికి ఒక న్యాయం బీసీ బిడ్డ ఈటలకు ఒక న్యాయమా అని రేవంత్ మండిపడ్డారు.టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు నాయకుల పై ఎన్నో భూ కబ్జా ఆరోపణలున్నాయని వారందరి పదవులు తీసేసి వారిపై విచారణకు ఆదేశించే దమ్ముందా అని రేవంత్ కేసీఆర్ పై మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here