ఏసీబీ వలలో ఎంపీవో..ఆస్తులను చూసి షాకైన అధికారులు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మండల పంచాయతీ అధికారిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది.ఈ దాడులలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించిన ఏసీబీ అధికారులు,సదరు అధికారి ఆస్తులను చూసి షాక్ అయ్యారు.శంషాబాద్ మండల పంచాయతీ అధికారి,అవినీతి తిమింగలం సురేందర్ రెడ్డి ఇంటిపై దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు 20 కోట్లకు పైగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించారు.మండల పంచాయతీ అధికారిపై ఏసీబీ చేసిన రైడ్ లో భారీగా బంగారం నగదుతో పాటు,ఖరీదైన విల్లాలు,ఇతర ఆస్తులకు సంబం ధించిన పత్రాలను తనిఖీలలో గుర్తించారు.దీంతో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డి పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.ఇక సురేందర్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో సురేందర్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది.*అవినీతి ఆరోపణలతో సస్పెన్షన్ విధుల్లో చేరే సమయానికి ఏసీబీ దాడులు*రెండు నెలల క్రితం రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పంచాయతీ అధికారి గా ఉన్న సమయంలో విధులు సక్రమంగా నిర్వహించే లేదన్న ఆరోపణలు సురేందర్ రెడ్డిపై వచ్చాయి.అనుమతులు లేని నిర్మాణాలపై చర్యలు తీసుకోలేదని ఆరోపణలు రావడంతో,డి పి వో విచారణ జరిపి సురేందర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు.ఇక ఇటీవల సురేందర్ రెడ్డి పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయటంతో సంగారెడ్డి మండలంలో ఎంపీడీవో గా చేరడానికి ఆయన రెడీ అయ్యారు.ఈ క్రమంలోనే ఊహించని విధంగా జరిగిన ఏసీబీ దాడులలో అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు.మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఎంపీడీవో సురేందర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల పై వివరాలను వెల్లడించారు.ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ సురేందర్ రెడ్డికి ఆదా యానికి మించిన ఆస్తులు ఉన్నట్టు సమాచారం రావడంతో తాము దాడులు నిర్వహించామని పేర్కొన్నారు.సురేందర్ రెడ్డి పై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని,డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సమా చారంతోనే తాము రైడ్ చేశామని పేర్కొన్నారు.*20 కోట్లకు పైబడి విలువైన ఆస్తుల సీజ్*సురేందర్ రెడ్డి ఆస్తులపై దాడులు లో భాగంగా భారీ ఎత్తున బంగారం నగదు విలువైన ఆస్తి పత్రాలతో పాటు ఇప్పటి వరకు దాదాపు 2,31,63,000 సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.బహిరంగ మార్కెట్లో వీటి విలువ 20 కోట్లకు పైబడి ఉంటుందని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడిం చారు.అతనిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.ఇదే సమయంలో ప్రతి డిపార్ట్మెంట్ లోనూ అవినీతికి పాల్పడే వారిపై ఏసీబీ అధికారుల నిఘా ఉంటుందని తెలిపి,ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here