మళ్లీ తెరపైకి సినీతారల డ్రగ్‌ కేసు

హైదరాబాద్:నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈ కేసులో సినీ తారలు ప్రముఖులతో కూడా లింకులు ఉన్నాయని ఆ రోపణలు ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా ఈ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ పలువురుకి క్లీన్ చిట్ ఇచ్చింది.వివరాల్లోకి వెళితే.ఒకప్పుడు బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైన డ్రగ్స్ మాఫియా తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీకి కూడా పాకింది.ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో కొంత మంది నటీనటులు కొంత మంది విదేశీయలు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.సరిగ్గా నాలుగేళ్ల క్రితం జూలై 2న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసారు.హైదరాబాద్ మాదక ద్రవ్యాల నిరో ధక విభాగం టాలీవుడ్‌కు చెందిన కొంత మంది సినీ ప్రముఖులను నార్కోటిక్స్ విభాగం వారి ఆఫీసుకు పిలిచి విచారించింది.అప్పట్లో ఈ కేసు టాలీవుడ్‌లో పెద్ద ప్రకం పనలే పుట్టించింది.ఈ కేసులో హీరో రవితేజ కారు డ్రైవరుతో పాటు దర్శకుడు పూరీ జగన్నాథ్,ఛార్మి కౌర్,ముమైత్ ఖాన్,తరుణ్,నవదీప్ సహా పలువురును విచా రించారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ పోలీసులు మొత్తంగా 12 కేసులు నమోదు చేసి 30 మందికి పైగా అరెస్ట్ చేసారు.అంతేకాదు 27 మందిని విచారించారు. 12 కేసుల్లో ముందుగా 8 కేసుల్లో మాత్రమే పోలీస్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.తాజాగా ఈ కేసులో రవితేజ,పూరీ జగన్నాథ్,ఛార్మి,ముమైత్ ఖాన్,తరు ణ్,నవదీప్,తనీష్,సుబ్బరాజు సహా 11 మందికి ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్ క్లీన్ చిట్ ఇచ్చింది.అయితే ఈ కేసులో పోలీసులు పలుకుబడి ఉన్న పెద్ద తలకాయలను ఒది లిపెట్టి చిన్న చిన్న ఆర్టిస్టులపై ఎక్కువ ఫోకస్ చేసారనే ఆరోపణలు వచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here