మొన్న చంద్రబాబు..నేడు లోకేష్‌పై కేసులు

అమరావతి:సీఎం జగన్,వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.శనివారం లోకేష్‌ మీడియాతో మాట్లాడుతూ హింసించే పులకేశిరెడ్డి తనపై ఇంకా ఎన్ని అక్రమ కేసులు పెడతావో పెట్టుకో రెడీ అని సవాల్ విసిరారు.టీడీపీ కార్యకర్త మారుతిపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పా ల్పడారని ప్రశ్నించిన తనపై వైసీపీ పోలీసులు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.దాడులకు పాల్పడుతోన్న వైసీపీపై ఎందుకు కేసులు పెట్టరు? అని ప్రశ్నించారు.కరోనా కట్టడిలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు.జగన్ అవినీతిని నిలదీసిన అచ్చెన్నాయుడిపై అక్రమ కేసులు,టీడీపీ కార్యకర్తలపై దాడులేంటని ప్రశ్నించిన తనపై ఫేక్ కేసు పెట్టారని మండిపడ్డారు.అధికారంలోకొచ్చింది ప్రజలను రక్షించేందుకా? ప్రతిపక్షంపై కక్ష తీర్చుకునేందుకా?అని జగన్ తీరును ప్రశ్నించారు.టీడీపీ నేతలు మీ కేసులకు భయపడరు అని లోకేష్‌ పేర్కొన్నారు. చంద్రబాబుపై కర్నూలులో..తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కర్నూలులో శుక్రవారం క్రిమినల్‌ కేసు నమోదైంది. ఆయన ఎన్‌-440కే కరోనా స్ట్రెయిన్‌ గురించి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా పలు టీవీ చానళ్లలో మాట్లాడారంటూ మాసపోగు సుబ్బయ్య అనే న్యాయవాది క ర్నూలు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసులు చంద్రబాబుపై ఐపీసీ 188,505(1)బి,(2) సెక్షన్లతో పాటు ప్రకృతి వైపరీత్యాల చట్టంలోని సెక్ష న్‌ 54 కింద నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here