ముంబై:దేశప్రధాని నరేంద్రమోడీపై నలుదిక్కుల నుంచి విమర్శనాస్త్రాలు వచ్చిపడుతున్నాయి.కరోనా సెకండ్ వేవ్ విషయంలో ప్రధాని అనుసరించిన విధానంపై ఇప్ప టికే ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు నిందలు వస్తున్న విషయం తెలిసిందే.ఇక ప్రతిష్టాత్మక సంస్థ భారత వైద్య మండలి ఏకంగా తన లేఖలో మోడీ నిష్క్రియాపర త్వాన్ని మరింతగా దుమ్మెత్తి పోసింది.రాష్ట్ర ప్రభుత్వాలు(బీజేపీయేతర) సైతం మోడీని విమర్శిస్తున్నాయి.ఇక ఇప్పుడు బీజేపీకి ఒకప్పటి మిత్రపక్షం హిందూ అను కూల వాద పార్టీ మహారాష్ట్ర కు చెందిన శివసేన సైతం ఇప్పుడు మోడీపై విమర్శల బాణాలు సంధించింది.ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ను నిలువరించడంలోను ప్రజల కు సౌకర్యాలను కల్పించడంలోను మోడీ సర్కారు పూర్తిగా విఫలమైందని శివసేన తన సొంత పత్రిక సామ్నా సంపాదకీయంలో తీవ్రస్థాయిలో చెరిగేసింది.సెకండ్ వేవ్పై నిపుణులు హెచ్చరించామని చెప్పినా ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు చెప్పాలని స్పష్టం చేసింది.అంతేకాదు ఇప్పటికీ ఈ దేశం గాంధీ-నెహ్రూలు స్థాపించిన వ్యవస్థపైనే జీవితాన్ని వెళ్లబుచ్చుతోందని పేర్కొంది.మార్పు తెస్తాం వారసత్వ రాజకీయాలను వెళ్లగొడతాం అన్నవి విధానాలుగా మారకపోగా నినాదాలుగా మాత్రమే స్థిరపడడం శోచనీయమని పేర్కొంది.ఇక కరోనా సమయంలో అన్ని విధాలా అతి పెద్దదేశంగా ఉన్న భారత్ పేద దేశాలకు చిన్న దేశాలకు సాయం చేసిన రోజులు అం తరించిపోయి నేడు అవే దేశాల ముందు చేతులు చాపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని సామ్నా దుయ్యబట్టింది.ముఖ్యంగా కరోనా సమయంలో ఆత్మనిర్భర భారత్ అంటూ నినాదాలు చేసిన ప్రధాని మోడీ ఇప్పుడు వచ్చిన దుస్థితికి ముఖ్యంగా మనకన్నా అన్ని విధాలా అణుమాత్రంగా ఉన్న దేశాల నుంచి సాయం తీసుకునేట ప్పుడు ఈ ఆత్మనిర్భర్ భారత్ నినాదం ఎటు కొట్టుకుపోయిందని సామ్నా నిలదీసింది.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...