పోరాట స్పూర్తికి చిహ్నమే..మేడే

హైదరాబాద్:కార్మికుల పోరాటాల్లో నుంచి పుట్టింది మేడే.సర్వసంపదలు సృష్టించేది శ్రామిక వర్గం.శ్రమ జీవులు ప్రపంచ వ్యాప్తంగా తమ సత్తా ఏమిటో చాటారు.8 గంటల పని హక్కు కోసం ఆనాటి ప్రభుత్వాల మెడలు వంచి పని గంటల హక్కు సాధించారు.తమ హక్కుల సాధన కోసం వందలాది మంది ప్రాణాలర్పించారు.1886 మే 3వ తేదీన చికాగో లోని హే స్క్వేర్‌ వద్ద పోలీసు కాల్పుల్లో ఒక వైపు రక్తం చిందుతుంటే మరోవైపు ఆ రక్తంలో తడిచిన ఎర్రబట్టను తమ జెండాగా పైకెత్తి చూపారు.కార్మికవర్గ త్యాగం అంటే అది.కార్మిక హక్కులు,పోరాటాలు,త్యాగం తోనే సాధించుకుంటాం.
పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసలవలే పని చేసేవారు.కార్మికులు రోజుకు 16 నుంచి 20 గంటల వరకు పని చేసేవారు.19వ శతాబ్దం ప్రారంభం నుంచి కార్మికులు తిరుగు బాట్లు ప్రారంభించారు.1806లో ఫిలడెల్ఫియా (అమెరికా)లో కార్మికులు సమ్మె చేశారు.ఆనాడు కార్మికులకు ఎటువంటి భద్రత గాని,సౌకర్యాలు గాని వుండేవి కాదు.ఫ్యాక్టరీల్లో గాలి,వెలుతురు సౌక ర్యాలు మృగ్యం.కార్మికులకు యంత్రాల నుండి రక్షణ లేదు.తరచుగా ప్రమాదాలకు గురై మరణించేవారు.కార్మికులు అమానుష శిక్షలకు గురౌతుండేవారు.కార్మికులు తమ పీడనకు వ్యతిరేకంగా యంత్రాలను ధ్వంసం చేసేవారు.ఈ విధ్వంసకాండ బ్రిటన్‌లో ప్రారంభమైంది.యంత్రాలను విచ్ఛిన్నం చేసేవారికి మరణశిక్ష విధిస్తూ బ్రిటన్‌లో చట్టం చేయబడింది.ఈ దుస్థితి నుంచి బయట పడడానికి పోరాటం సల్పడం ఒక్కటే మార్గమని కార్మిక వర్గం అర్ధం చేసుకుంది.కార్మిక వర్గం చైతన్యవంతంగా వున్న దేశాల్లో ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం ప్రారంభమైంది.1806లో ఫిలడెల్ఫియా నగరంలో ‘మె కానిక్స్‌ యూనియన్‌’ పేరుతో కార్మిక సంఘాన్ని స్థాపించారు.ఇంగ్లాండ్‌,ఫ్రాన్స్‌,జర్మనీ దేశాల్లో కార్మికులు సంఘాలను నిర్మించుకొని పోరాటాలు సాగించారు.ట్రేడ్‌ యూనియన్ల మహత్తర శక్తిని చూసి పాలకులు హడలెత్తిపోయారు.ట్రేడ్‌ యూనియన్లు నిర్మించుకోవడం చట్ట విరుద్ధమని పాలకులు ప్రకటించారు.ట్రేడ్‌ యూనియన్లను నిషేధించారు.అయినా ట్రేడ్‌ యూనియన్ల నిర్మాణం వేగంగా సాగిం ది.1848లో కారల్‌మార్క్స్‌ ‘కమ్యూనిస్టు ప్రణాళిక’లో ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ అని పిలుపునిచ్చారు.1871లో ఏర్పడిన మొదటి కార్మికవర్గ రాజ్యం ఫ్రాన్స్‌లో కార్మికవర్గ పోరాటాల ఫలిత మే ప్యారిస్‌ కమ్యూన్‌. *1886 చికాగో కార్మికుల పోరాటం*
1884 అక్టోబర్‌లో అమెరికా,కెనడాల ఆర్గనైజ్డ్‌ ట్రేడ్‌ అండ్‌ లేబర్‌ యూనియన్ల నాలుగవ మహాసభ జరిగింది.1886 మే నుండి 8 గంటల పని చట్టబద్దమైన పని దినంగా వుంటుందని తీర్మానం చే సింది.మే 1వ తేదీన సమ్మె చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చింది.’మనిషి జీవితంలో రోజులో 8 గంటల పని,8 గంటల విశ్రాంతి,8 గంటల దినచర్య’ అనే శాస్త్రీయ పద్ధతి కోసం పోరాడాలని నిర్ణయించారు.ఈ పిలుపుకు అశేషమైన స్పందన వచ్చింది.వేలాది మంది కార్మికులు అనేక సంస్ధలు ‘8 గంటల పని దినం’ కోసం మే1వ తేదీన సమ్మెలో పాల్గొన్నారు.చికాగో సమ్మె ఎంతో సమర శీలంగా జరిగింది.అమెరికా ప్రభుత్వం కార్మిక వర్గంపై మే 3వ తేదీన తీవ్ర నిర్బంధం సాగించింది.మే 3వ తేదీన జరిగిన పోలీసుల దాడిలో ఆరుగురు కార్మికులు ఆహుతి అయ్యారు.ఎందరో కార్మికు లు గాయపడ్డారు.దీనికి నిరసనగా మే 4వ తేదీన చికాగో నగరం లోని హే మార్కెట్‌ వద్ద కార్మికులు ప్రదర్శన నిర్వహించారు.ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది.ఈ ప్రదర్శనపై యజమానులు,ప్రభుత్వ తొత్తులు బాంబుదాడికి పూనుకున్నారు.ఈ ఘర్షణలో నలుగురు కార్మికులు,అనేక మంది పోలీసులు మరణించారు.అల్బర్ట్‌ వర్స్‌సాన్స్‌,ఆగస్టు స్పైయిన్‌,ఆడాల్ఫ్‌ ఫిషర్‌,జార్జి ఏంగెల్స్‌ అనే నలుగురు కార్మిక నాయకులపై అక్రమ కేసులు బనాయించి 1887 నవంబర్‌ 11న ఉరితీశారు.ఉరికంబం ఎక్కే ముందే స్పైయిస్‌ తన చివరి మాటగా ‘మా మాటల కన్న,మా మూగబోయిన గొంతులు రణ ఘోషగా మోగే కాలం తప్పక వస్తుంది’ అన్నారు.మరో ముగ్గురు నాయకులకు యావజ్జీవ శిక్ష విధించారు.వీరిని 1893లో విడుదల చేశారు.ఇలానీస్‌ రాష్ట్ర నూతన గవర్నర్‌ వీరిపై నేరం రుజువు కాలేదని ప్రకటించాల్సి వచ్చింది.అమెరికా బూర్జువా న్యాయం బహిర్గతం అయ్యింది.అనేక మంది సమరశీల నాయకులను కూడా దీర్ఘకాలిక జైలుశిక్షలకు గురిచేశారు.అమెరికన్‌ కార్మికుల త్యాగం వృధా కాలేదు.అభివృద్ధి చెందుతున్న యూరప్‌ కార్మిక ఉద్యమం వారితో చేతులు కలపాలని నిర్ణయించింది.1889లో ప్యారిస్‌లో జరిగిన సోషలిస్టు ఇంటర్నేషనల్‌ మొదటి కాంగ్రెస్‌ మేడేను అంత ర్జాతీయ కార్మికదినంగా అమలు చేయాలని తీర్మానాన్ని రూపొందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here