కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్..

హైదరాబాద్:కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్ట్‌ అయ్యారు.కాసేపటి క్రితమే ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు.బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అరెస్టు అయిన ఓయూ నేతలను పరా మర్శించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్లారు.ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.అరెస్ట్‌ అయిన జగ్గారెడ్డిని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు తీసుకెళ్లారని సమా చారం అందుతోందిఇక అటు ఓయూ వీసీ చాంబర్‌ ను ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు ముట్టడించారు.రాహుల్‌ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు.కానీ రాహుల్‌ గాంధీ సభకు అస్సలు అనుమతి ఇచ్చేదేలే అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే వరుసగా కాంగ్రెస్‌ పార్టీ నేతలను అరెస్టు చేస్తు న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here