కోల్‌కతా:పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కోవిడ్ పరిస్థితులపై చర్చించేందుకు ఇటీవల ము ఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేవలం కొంతమంది బీజేపీ ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారని ఆరోపించారు.ఫెడరల్ స్పూర్తికి ప్రధాని విఘాతం కలిగిస్తున్నారని ముఖ్యమంత్రులను అవమానిస్తున్నారని విమర్శించారు.ఇది చాలా దురదృష్టకరం.సమావేశంలో ప్రధాని మోదీ,బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే మాట్లాడారు.ప్రధాని మాతో మాట్లాడలేదు కనీసం మమ్మల్ని మాట్లాడనివ్వలేదు.కేవ లం కొంతమంది జిల్లా మెజిస్ట్రేట్స్‌తో మాట్లాడారు.ఒకరకంగా ఇది ముఖ్యమంత్రులను అవమానపరచడమే.ముఖ్యమంత్రులు చెప్పేది వినేందుకు ఆయన ఎందుకం తలా భయపడుతున్నారు.అభద్రతా భావంలో ఉన్నారా.? మోదీతో సమావేశం వన్ నేషన్-ఆల్ హ్యుమిలియేషన్(ఒకే దేశం-అందరినీ అవమానపర్చడం)లా ఉం ది.అంటూ మమతా బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు.ఒకవేళ ముఖ్యమంత్రులు చెప్పేది వినడం ఇష్టం లేకపోతే సమావేశానికి ఆహ్వానించడమెందుకు అని మ మతా ప్రశ్నించారు.మోదీకి అహంకారం ఎక్కువ అని మండిపడ్డారు.సమావేశంలో చాలా రాష్ట్రాలు పాల్గొన్నాయి.కానీ బీజేపీ ముఖ్యమంత్రులకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చారు.యూపీ,ఆంధ్రా,ఛత్తీస్‌గఢ్‌ల నుంచి జిల్లా మెజిస్ట్రేట్లకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.ఇక ఏ ముఖ్యమంత్రికి అవకాశం ఇవ్వలేదు.అసలు వాళ్లు ఏ మనుకుంటున్నారు.మేమేమైనా నిర్బంధ కార్మికులమా లేక ఆడించినట్లు ఆడేవాళ్లం అనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు.తానేమీ అందరి ముఖ్యమంత్రుల త రుపున వకల్తా పుచ్చుకుని మాట్లాడట్లేదని మమతా బెనర్జీ అన్నారు.కానీ జరుగుతున్నదేమిటీ మోదీ నియంతృత్వం కాదా అని ప్రశ్నించారు.బెంగాల్‌లో వ్యాక్సిన్ల కొరతపై తాను మోదీతో మాట్లాడాలనుకున్నానని కానీ ఆ అవకాశం లేకుండా చేశారని అన్నారు.దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్న మోదీ వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు.గతంలోనూ ఇలాగే దేశంలో కరోనా అంతమైందని చెప్పారని కానీ ఆ తర్వాత కేసులు పెరిగాయని గుర్తుచేశారు.
Latest article
తైక్వండో జూనియర్ లకు బెల్ట్ ల ప్రదానోత్సవం
●ఆత్మ రక్షణ శారీరక,మానసిక దృఢత్వానికు తైక్వండో అవసరం.
●ఆడపిల్లలకు తప్పనిసరి తైక్వాండో శిక్షణ అందించాలి.
●సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకోండి.
●మాస్టర్ గడ్డం వెంకటస్వామి
హనుమకొండ:హనుమకొండ జిల్లా కేంద్రంలోని బాల సముద్రం చైల్డ్రన్ పార్క్ లో జరిగిన...
వేములాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
వేములాడ:మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్నకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు.వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం...
త్వరలో..హైదరాబాద్‌లో కిక్కిచ్చే నీరా కేఫ్
హైదరాబాద్:హైదరాబాద్‌లో ఎన్నో కేఫ్‌లున్నాయి.కానీ కిక్కిచ్చే కేఫ్‌ను చూశారా ఈ కేఫ్‌లో టీ,కాఫీలు కాదు.అంతకు మించిన కిక్కిచ్చే 'నీరా' దొరకనుంది.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి నీరా కేఫ్ ప్రారంభానికి సిద్ధమైంది.హుస్సేన్ సాగర్ ఒడ్డున...