వాడుకుని వదిలేయడమే..కేసీఆర్ నైజం

కరీంనగర్:ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,గాదె ఇన్నయ్య,కపిలవాయి దిలీప్,కోదండరాం,విజయశాంతి,వివేక్,జిట్టా బాలకృష్ణ రెడ్డి,రఘునందన్ రావు,కేకే.మహేందర్ రెడ్డి,తాటికొండ రాజయ్య,కొండా మురళి,కడియం శ్రీహరి,స్వామి గౌడ్,జితేందర్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి,గటిక విజయ్,ఈటల రాజేందర్.ఇలా చెబితే చాలా మందే ఉంటారు.తెలంగాణ ఉద్యమంలోకి కేసీఆర్ ను తీసుకురావడంలో,ఉద్యమం జరిగినంత కాలం కీలకపాత్ర వహించిన వి.ప్రకాశ్​కు,మారోజు వీరన్న అనుచరుడు చెరుకు సుధాకర్ ను కూడా వాడుకుని వదిలేశారు.తెలంగాణ కోసం ఉద్యమించి ఏడాది పాటు జైల్లో ఉన్న సుధాకర్ కు ప్రాధాన్యత ఇవ్వకపోగా పార్టీ నుంచి బయటకు పోయే లా చేశారు.తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అని బహిరంగ వేదికలపై కాళ్లు మొక్కిన కేసీఆర్ లోలో పల ఆయన గురించి ఎంతో చులకనగా మాట్లాడి అవమా నించారు.బహుజన నాయకుడు టైగర్ ఆలె నరేంద్రను సెంటిమెంట్ తో పార్టీలోకి ఆహ్వానించి వాడుకుని వొదిలేశారు.విజయశాంతితో రాయబారం నడిపి తమ పార్టీలో కి వస్తే బలం పెరుగుతుందని నమ్మబలికి తల్లి తెలంగాణ పార్టీని లేకుండా చేసి తర్వాత ఆమెకు పొమ్మన కుండా పొగబెట్టిన ఘనుడు కేసీఆర్.సేవా దృక్పథంతో ఉద్యో గం చేస్తూ ప్రజల్లో మంచి పలుకుబడి కలిగిన సీఐ దాసరి భూమయ్య రిటైర్డ్ అయిన తర్వాత రాజకీయా ల్లోకి వస్తాడనే భయంతో అక్రమంగా ఏసీబీ కేసులో ఇరికించా రు.వరంగల్ పట్టణంలో పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కొండా మురళి దంపతులను బతిమిలాడి తీసుకొని పార్టీ అధికారంలోకి రావడానికి వాడుకున్నారు.మీ డియా రంగంలో ఎంతో అనుభవం కలిగి ఉద్యమానికి ఎంతో మేలు చేసిన బహుజన జర్నలిస్ట్ గటిక విజయ్ ను పీఆర్వోగా వాడుకుని మధ్యలో వొదిలేశారు.ఇప్పుడు బహుజన నాయకుడు ఈటల రాజేందర్ ను కేసీఆర్ బర్తరఫ్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here