హైదరాబాద్:నాడు ఆలె నరేంద్ర,చెరుకు సుధాకర్,విజయశాంతి,మొన్న సీఐ దాసరి భూమయ్య,తాటికొండ రాజయ్య,కొండా మురళి నిన్న కడియం శ్రీహరి,గటిక విజ య్ నేడు ఈటల రాజేందర్,త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో చిత్తశుద్ధి,అంకితభావం కలిగిన బహుజన నాయకులను సీఎం కేసీఆర్ టార్గెట్ చేసి తొలగిస్తూ వస్తున్నారు.తెలంగాణ వ్యతిరేకులను,ఉద్యమం చేస్తున్న వారిని ఉరికిచ్చి కొడతానన్న వాళ్లను పార్టీలో చేర్చుకొని మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న బహుజన నా యకులు ఒక్కొక్కరినీ రాజకీయంగా సమాధి చేసుకుంటూ వస్తున్నారు.పట్టుమని 0.5 శాతం కూడా లేని సామాజిక వర్గం 93 శాతం ఉన్న దళిత,బహుజనులపై ఆధిపత్యం చలాయిస్తోందంటే దానికి కారణం బహుజనుల్లో చైతన్యం,ఐకమత్యం లేకపోవడమే.బహుజన వర్గాలు బానిసత్వంలో ఉన్నంత కాలం ఆధిపత్య వర్గాల నా యకులు అణచివేస్తూనే ఉంటారని ఇప్పటికైనా బహుజన నాయకత్వం గుర్తించాలి.కేసీఆర్ కుటిల రాజకీయాలను తిప్పికొట్టాల్సిన సమయం వచ్చింది.కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే బహుజన నేతలను కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి తప్పిస్తూ వస్తున్నారు.దళితుడిని సీఎం చేస్తానని తొలి దఫా గద్దెనెక్కిన కేసీఆర్ దళిత నాయకుడు తాటికొండ రాజయ్యను డిప్యూటీ సీఎంను చేసి చేతులు దులుపుకున్నారు.రాజయ్య ఎదుగుదలను ఓర్వలేక పదవి నుండి తొలగించారు.రాజయ్య తొలగింపుపై దళిత,బహుజన సంఘాలు ఆందోళన చేయడంతో ఎంపీగా ఉన్న మరో దళిత నాయకుడు కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కేసీఆర్ తనను తాను రక్షించుకున్నారు.రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కేటీఆర్ ను సీఎం చేయాలని అందుకు అడ్డుగా ఉండే సీనియర్లను డమ్మీలను చేశారు.హరీశ్‌రావు లాం టి సీనియర్లకు కూడా తొలుత మంత్రి పదవులు ఇవ్వలేదు.అదే సమయంలో కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీ శ్రేణులకు కేటీఆర్ ను కేంద్రంగా చేశారు.మంత్రి పదవులను భర్తీ చేసి పాలనను గాడిలో పెట్టాలని వచ్చిన ఒత్తిడితో చాలా కాలానికి మంత్రి పదవులు నింపాడు. అయితే ప్రతి పేషీలో ఆయన కోటరీకి చెందిన రిటైర్డ్ అధికారులను ఓఎస్డీగా నియమించి తనకు తెలియకుండా ఏ నిర్ణయాలూ చేయరాదని ఆదేశాలిచ్చి మంత్రులను డమ్మీలుగా మార్చారు.ఉద్యమ సమ యం నుంచి ఇప్పటి వరకు కేసీఅర్ ను పరిశీలిస్తే ఆయన ఎంతటి కుట్రదారుడో అర్థమవుతుంది.ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ ఏర్పడాలని,ఆ తెలంగా ణలో బహుజన రాజ్యం ఏర్పడాలని ఆ దిశగా రెండు ఏక కాలంలో రెండు ఉద్యమాలు చేయాలన్న మారోజు వీరన్న ప్రొఫెసర్ జయశంకర్,వి.ప్రకాశ్,డాక్టర్ చెరుకు సు ధాకర్ నాయకత్వంలో సూర్యాపేటలో తెలంగాణ మహాసభ పెట్టించి అప్పటి టీడీపీ ప్రభుత్వానికి వణుకు పుట్టించాడు.దాంతో భయపడిన అప్పటి సీఎం చంద్రబాబు వీ రన్నను బూటకపు ఎన్కౌంటర్ లో కాల్చి చంపారు.ఆ క్రమంలో ఉద్యమాన్ని బతికించాలని తపనపడిన జయశంకర్,వి.ప్రకాశ్,చెరుకు సుధాకర్ కేసీఆర్‌కు ఎన్నోరకా లుగా వివరించి ఉద్యమంలోకి తీసుకొచ్చారు.అవసరాలు తీరేదాకా నాయకులను వాడుకోవడం తర్వాత వారిని తొలగించడం కేసీఆర్‌కు పరిపాటయింది.
Latest article
BRS vs Tummala: తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్‌తో కాకరేపుతున్న ఖమ్మం పాలిటిక్స్ ..ప్రత్యామ్నాయం కోసం BRS ప్లాన్స్
BRS vs Tummala: అసమ్మతి సెగలు, అసంతృప్తుల నిరసనలతో BRSకి గట్టి దెబ్బ తగలనుంది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక విషయంలో తుమ్మల లాంటి సీనియర్ నేతను పక్కన పెట్టడంతో తాడో పేడో...
మూడు పార్టీల జాతీయ హోదా రద్దు..!
న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నది.మూడు పార్టీల జాతీయ హోదాను ఉపసంహరించుకున్నది.అదే సమ యంలో మరో కొత్త పార్టీకి జాతీయ హోదా ఇచ్చింది.కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమైంది.ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్,...
తాటాకు పందిళ్ళ కింద రాములోరి కళ్యాణం
భద్రాచలం:భద్రాచలంలో శ్రీసీతారాములవారి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది కనులవిందుగా రామచంద్రస్వామివారి కల్యాణ క్రతు వు జరిగింది వేదమంత్రోచ్ఛరణల నడుమ వధూవరులైన సీతారాములను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి పండితులు తీసు కొచ్చా రు.అభిజిత్ లగ్నంలో సీతమ్మ...