తెతెదేపా కు ఎల్‌ రమణ రాజీనామా

హైదరాబాద్‌:తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పం పారు.తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు.రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తెరాసలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రమణ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.తగిన గుర్తింపు ఇస్తామని,రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు.దీంతో తెరాసలో చేరేందుకు రమ ణ అంగీకరించారు.మూడు,నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం నెల రోజులుగా రమణతో సంప్రదింపులు జరు గుతున్నాయి.మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకొని సీఎంతో భేటీకి నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here