రాజన్న సిరిసిల్లా:చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో పర్యటించిన కలెక్టర్ బైక్ మీద పర్యటించి గ్రామ శివారులో ఉన్న వైకుంఠధామం,నర్సరీ,కంపోస్ట్ షెడ్ లను పరిశీలించారు.దాదాపు కిలోమీటర్ దూరం పాటు బైక్ మీద ప్రయాణించి కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించారు.అన్ని గ్రామాలలోని ఎవెన్యూ ప్లాంటేషన్,కంపోస్ట్ షెడ్లు,వైకుంఠధామాలు,నర్సరీలు,పల్లె ప్రకృతి వనాలు,పారిశుధ్య నిర్వహణను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఇంటింటికీ ఆరు మొక్కలు పంపిణీ చేస్తున్నారా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.మొక్కలు పంపిణీ చేసేటప్పుడు వివరాలు నమోదు చేసుకునే రిజిస్టర్ ను కలెక్టర్ పరిశీలించారు.మండలంలో ఈరోజు పర్యటించిన అన్ని గ్రామాలలో ఎవెన్యూ ప్లాంటేషన్ సరిగా లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామాల్లో ప్రగతిలో ఉన్న పనులపై దృష్టి సారిస్తున్నారా లేదా అని మండల ఎంపీడీఓ,ఎంపీఓ లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ,పచ్చదనం పెంపొందించే దిశగా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు.గ్రామాల రూపురేఖలు మార్చడానికి ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో క్షేత్ర స్థాయిలో ప్రజలు భాగస్వామ్యమై పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ అన్నారు.వైకుంఠధామాల చుట్టూ తప్పనిసరిగా బ యో ఫెన్సింగ్ (మొక్కలతో ఫెన్సింగ్) చేయాలని ఆదేశించారు.అలాగే కంపోస్ట్ షెడ్ లోని వ్యర్థాలను సిరిసిల్ల లోని డీఆర్ సి సి సెంటర్ కి పంపించే విధంగా చూడాలని అన్నారు.ఈ సందర్శనలో కలెక్టర్ వెంట మండల ఎంపీడీఓ,రవీందర్,ఎంపీఓ ప్రదీప్,సంబంధిత గ్రామాల సర్పంచులు,కార్యదర్శులు,తదితరులు ఉన్నారు.